తెలుగులో నెట్ ఫ్లిక్స్ సెల్ఫ్ గోల్! ఇక కోలుకోవడం కష్టమే!

ఓటీటీ అనగానే చాలామంది డైరెక్టర్లకు బూతు మాత్రమే గుర్తొస్తుందేమో! 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చూడగానే అదే అనిపించింది. ఈ సిరీస్ తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ నెట్ ఫ్లిక్స్ జెండా పాతేయాలనుకుంది. కానీ రియాలిటీలో మాత్రం మూతిపళ్లు విరగొట్టుకుంది! ఇంతకీ ఏం జరిగింది?

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 08:38 PM IST

ఓటీటీ అనగానే మన దేశంలో చాలామందికి గుర్తొచ్చేది ‘నెట్ ఫ్లిక్స్’, ‘అమెజాన్ ప్రైమ్’, ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’. తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘ఆహా’ కూడా పాపులర్. సబ్ స్క్రిప్షన్ రేట్ బట్టి చూసుకుంటే నెట్ ఫ్లిక్స్ ని ఉపయోగించేవాళ్లు మన దగ్గరయితే చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. నెట్ ఫ్లిక్స్ మాత్రమే కాదు ఓటీటీ సంస్థలన్నీ మంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని తెగ తాపత్రయపడుతుంటాయి. ఆ ఆరాటంలో కొన్నిసార్లు ఘోరమైన తప్పిదాలు చేస్తుంటాయి. దీని వల్ల పాజిటివ్ ఇమేజ్ రావడం సంగతి అటుంచితే.. ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తెలుగులో చేసిన ఓ ప్రయోగం విషయంలో అలానే జరిగిందా అనిపిస్తుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. విక్టరీ వెంకటేష్ పేరు చెప్పగానే మీలో చాలామందికి అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలే గుర్తొస్తాయి. 37 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న వెంకీమామ.. ఎవరికీ సాధ్యం కానీ విధంగా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క వివాదం కూడా లేదు. ఇప్పుడు అదే వెంకటేష్ ని అడ్డం పెట్టుకుని తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుందామని నెట్ ఫ్లిక్స్ బీభత్సమైన ప్లాన్ వేసింది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ప్రతి తెలుగింట్లోనూ దూరిపోవాలని పెద్ద స్కెచ్ వేసింది. కట్ చేస్తే సిరీస్ మొత్తం బూతులు, మితిమీరిన శృంగారం ఉండేసరికి జనాలు తీసుకోలేకపోయారు. దానికి తోడు వెంకటేష్, రానా లాంటి మంచి యాక్టర్స్ ని అలాంటి పాత్రల్లో అస్సలు చూడలేకపోతున్నారు.

నార్మల్ గానే నెట్ ఫ్లిక్స్ అంటే కాస్త రేటు ఎక్కువ అని చాలామంది తెలుగువాళ్లు దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వెంకటేష్ లాంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నటుడితో బూతు వెబ్ సిరీస్ తీసి ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. ఏదో చేయాలని ప్రయత్నించిన నెట్ ఫ్లిక్స్.. మూతిపళ్లు అడ్డంగా విరగ్గొట్టుకుంది. ఫ్యూచర్ లో కూడా కోలుకోలేనంతగా బొక్కాబోర్లా పడింది. సోషల్ మీడియాలో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ వెంకటేష్ ని తిడుతున్నారు. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ని ఓ రేంజులో ఏసుకుంటున్నారు. ఏ ఓటీటీపైనా కూడా గత కొన్నేళ్లలో ఈ రేంజ్ నెగిటివిటీ అయితే రాలేదనే చెప్పాలి. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం తెలిసి చేసిందా? తెలియక చేసిందో గానీ మొత్తానికి ఉన్న పరువు కాస్త ఊడగొట్టుకుంది.

‘రానా నాయుడు’ కథేంటి?

రానా నాయుడు(రానా దగ్గుబాటి) బాలీవుడ్ సెలబ్రిటీలకు మోస్ట్ వాంటెడ్ ఫిక్సర్. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇట్టే సాల్వ్ చేస్తుంటాడు. చాలా ఇల్లీగల్ పనులు కూడా చేస్తుంటాడు. మరోవైపు 15 ఏళ్లు జైల్లో ఉన్న రానా నాయుడు తండ్రి నాగ నాయుడు(వెంకటేష్) విడుదలై బయటకొస్తాడు. తీరా కట్ చేస్తే.. తండ్రి కొడుకు ఇద్దరికీ అస్సలు పడదు. రానాకు పెళ్లి అయిపోయి కొడుకు, కూతురు ఉంటే.. అతడి అన్న తేజ్ నాయుడు, తమ్ముడు జప్ఫా నాయుడు ముంబయిలోనే ఉంటారు. మరి నాగ నాయుడు, రానా నాయుడు మధ్య గొడవ దేనికోసం? నాగ 15 ఏళ్లు ఎందుకు జైల్లో ఉన్నాడో తెలియాలంటే సిరీస్ చూడాలి. ఒకవేళ ఈ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడటం బెటర్. లేదంటే మీ ఇంట్లో వాళ్లతో కచ్చితంగా తన్నులు తింటారు. సరే ఇదంతా పక్కనబెడితే నెట్ ఫ్లిక్స్ పై బూతుముద్ర పడటంపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed