దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న నయనతార.. ఇటీవలే దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే మహాబలిపురంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అలాగే వీరి పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే.. వీరి పెళ్లిలో సూపర్ స్టార్స్ రజినీ, షారుఖ్ లతో పాటు మణిరత్నం, ఇళయరాజా పాల్గొని ఆశీర్వదించారు.
ఇదిలా ఉండగా.. నయన్ – విగ్నేష్ పెళ్ళికి సంబంధించి స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కి రూ. 25 కోట్లకు అమ్మేశారంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఇటీవలే ఈ జంట నెట్ ఫ్లిక్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించి పెళ్లికి సంబంధించి ఫోటోలను లీక్ చేశారని, అందుకు నెట్ ఫ్లిక్స్ డీల్ క్యాన్సల్ చేస్తూ.. ఈ జంటను రూ. 25 కోట్లు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపిందంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నయన్ పెళ్లి వీడియోపై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే నయనతార, విగ్నేష్ శివన్ నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్నారు అంటూ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో నెట్ ఫ్లిక్స్ కి, నయన్ విగ్నేష్ లకు మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదని, అన్ని పుకార్లేనని స్పష్టమైందంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుతం నయన్ – విగ్నేష్ ల ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. మరి నయన్ విగ్నేష్ ల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
These images of Nayanthara and Vignesh have us seeing stars 🤩✨
BRB, we’re doing a little happy dance ourselves because THEY’RE coming to Netflix🕺💃it’s beyond a fairy tale!! pic.twitter.com/14poQwNAZv
— Netflix India (@NetflixIndia) July 21, 2022