మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా.. గతవారం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక రిలీజ్ ముందే భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
ఈ క్రమంలో కలెక్షన్లు రూ.700 కోట్ల వరకు సమీపించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ లోనూ ట్రిపుల్ ఆర్ హవా కొనసాగుతోంది. అదేవిధంగా నేపాల్ దేశంలో కూడా ట్రిపుల్ ఆర్ కి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ ల నటనతో పాటు సినిమా చివరిలో వచ్చే ‘ఎత్తర జెండా’ పాటకు నేపాల్ థియేటర్లో ఫ్యాన్స్ నాన్ స్టాప్ డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి నేపాల్ లో RRRకి వస్తున్న స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Craze of RRR in NEPAL just mind boggling 🔥 BO performance @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @RRRMovie jhukega nahi thakega nahi rukega nahi 🔥🔥 pic.twitter.com/rfmoUd58lH
— Dinesh Shrestha (@me_dineshrestha) March 30, 2022