స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా మూవీ "శాకుంతలం". మైథలాజికల్ డ్రామా జానర్ లో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా మూవీ “శాకుంతలం”. మైథలాజికల్ డ్రామా జానర్ లో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లతో నిర్మాత నీలిమ గుణ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తవన వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గురించి నీలిమ గుణ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో శాకుంతలం మూవీ తెరకెక్కింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. దిల్ రాజు గారు ఈ సినిమాను ఎంతగానో నమ్మారని నీలిమ వెల్లడించారు. ఈ సినిమాకు అంత పెద్ద సెట్స్ వేయడం సులువు కాదని సమంత నుంచి ఎంతో మద్దతు లభించిందని నీలిమ గుణ అన్నారు.
అలానే ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. మోహన్ బాబుతో పని చేయాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నానని.. ఈ సినిమాతో ఆ కల తీరిందని నీలిమ గుణ వెల్లడించారు. అల్లు అర్హ బార్న్ స్టార్ అని నీలిమ గుణ చెప్పుకొచ్చారు. అలానే ఓ సందర్భంగాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆమె ప్రస్తవించారు. ఆయనతో సినిమా చేయాలని ఉందని నీలిమ పేర్కొన్నారు. తారక్ గురించి నాన్న గొప్పగా చెప్పేవారని ఆమె అన్నారు. నాకు ఇష్టమైన హీరో ఎవరూ అని చెప్పలేనని, ఒక్కో హీరోలో ఒక్కో లక్షణం ఇష్టమని ఆమె తెలిపారు.
శాకుంతలంలో జూనియర్ ఎన్టీఆర్ ను అడగలేదని ఆమె తెలిపారు. ఈ సినిమాలో తొలుత దుశ్యతుండి పాత్ర కోసం ఎన్టీఆర్ ను అనుకున్నట్లు టాక్. అయితే దుశ్యంతుడి పాత్ర పరిమితం కావడంతో ఎన్టీఆర్ ను ఈ సినిమా కోసం పరిశీలించలేదని తెలుస్తోంది. మరి.. శాకుంతల సినిమా విషయంలో తారక్ గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.