ఆహా ఓటీటీ వేదికగా.. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో.. రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ అయితే సంచలన రికార్డులు నమోదు చేయగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్‌తో.. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డులు బ్రేకవ్వడమే కాక.. సరికొత్త రికార్డుల క్రియేట్ చేసేందుకు రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తుండగా.. తొలి భాగం.. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో.. పవన్ కళ్యాణ్.. అన్నయ్య పిల్లలతో తనకున్న అనుబంధం గురించి వివరించాడు.
ఎపిసోడ్‌లో భాగంగా బాలయ్య రామ్ చరణ్‌కు కాల్ చేసి.. బాబాయ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పమని అడిగాడు. దాంతో రామ్ చరణ్ బాబాయ్‌తో తనుకున్న అనుబంధాన్ని వివరించాడు. అంతేకాక.. ‘‘మీ బాబాయ్ గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్ చెప్పు’’ అని అడుగుతాడు. అప్పుడు రామ్ చరణ్ ‘‘బాబాయ్ లైఫ్ చాలా బోరండి. కాకపోతే బాబాయ్‌కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వారానికి ఏడు రోజులు తినమన్నా అదే తింటాడు’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక బాలయ్య చిన్నప్పటి నుంచి చరణ్ నా దగ్గరే పెరిగాడు అని పవన్ అన్నాడు. నిజమేనా అని ప్రశ్నిస్తే.. అప్పుడు రామ్ చరణ్..‘‘అవునండి.. అది వంద శాతం నిజం. మా అమ్మ కంటే ఎక్కువ బాబాయ్ దగ్గరే పెరిగాను. నన్ను భరించలేకపోతే మా నాన్న బాబాయ్ దగ్గరికి పంపేవారు. ఆయన నాతో గంటలు గంటలు మాట్లాడే వాళ్లు. బాబాయ్ చెప్పినవి ఒక 10 రోజులు అలా ఫాలో అయ్యే వాడిని. తర్వాత మళ్లీ మామూలే’’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
ఆ తర్వాత బాలయ్య.. ‘‘ఇప్పుడు మీరిద్దరూ కలిసి మీ నాన్నకు తెలియకుండా చేసిన అల్లరి పని చెప్పు’’ అని చరణ్‌ని అడిగారు. వెంటనే పవన్ పక్కనుంచి ‘‘సింగపూర్ వెళ్లినప్పుడు నిన్ను ఎలా చూసుకున్నానో చెప్పు’’ అని హింట్ ఇచ్చి సైలెంట్ అయ్యారు. అప్పుడు రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో నేను బాబాయ్‌కు నరకం చూపించాను. అమ్మ మాతో లేరు కదా అని రోడ్డు మీద ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అన్నీ తిని అక్కడే వాంతి చేసుకున్నాను. పాపం అది ఆయనే క్లీన్ చేసి నన్ను హోటల్ తీసుకెళ్లారు. ఆయన సింగపూర్ ట్రిప్‌ని నేను నాశనం చేశాను’’ అని చెప్పుకొచ్చాడు చరణ్.
‘‘అప్పుడు నీ వయసెంతమ్మా’’ అని బాలకృష్ణ చరణ్‌ని అడగ్గా… పవన్ కళ్యాణ్ ‘నాలుగు, ఐదు సంవత్సరాలు అనుకుంటా.’ అన్నారు. వెంటనే బాలయ్య.. ‘‘ఐదేళ్ల పిల్లాడిని చంకలో పెట్టుకుని సింగపూర్ వెకేషన్ వెళ్లడం ఏంటమ్మా’’ అని సరదాగా ఆటపట్టించాడు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ ప్రస్తుతం వైరలవవుతోంది. పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ అనుబంధం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.