సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటే.. అందరు చెప్పే ఒకే ఒక్క పేరు నయనతార. భాషలతో సంబంధం లేకుండా నయనతార సౌత్ ఇండియన్ సినీ సామ్రాజ్యంలో మహారాణిగా వెలిగిపోతుంది. సీనియర్ హీరోలు మాత్రమే కాదు, ఇప్పటికీ యువ హీరోలు సైతం నయన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకే నయనతార టాప్ హీరోయిన్ గా ఇంకా కొనసాగుతోంది.
2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళం చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది నయనతార. తరువాత ఆమె ప్రయాణం ఎలా సాగిందో, ఎంత కష్ట పడితే టాప్ హీరోయిన్ గా ఎదిగిందో అందరికీ తెలిసిందే. కానీ.., ఇండస్ట్రీలోకి రాక ముందు నయనతార పడ్డ కష్టాలు చాలా మందికి తెలియదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమాల్లోకి రాకముందు నయన్ యాంకర్ గా రాణించింది. సుమారు 20 ఏళ్ళ క్రితమే నయన్ ఓ మళయాళ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేసింది. అప్పుడు నయనతార వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అలా 16 ఏళ్ళ వయసులో నయన్ యాంకరింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. “నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను ఇంట్రో ఇచ్చుకుంటుంది నయనతార. ఈ వీడియోలో నయనతారని చూసిన ఫ్యాన్స్ మాత్రం.. షాక్ అవుతున్నారు. కాస్త చుబ్బీగా, నేచురల్ లుక్ కనిపిస్తున్న ఈ అమ్మాయినే.. స్టార్ హీరోయిన్ నయనతార అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.