Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో నూతన వధూవరుల జంట శుక్రవారం తిరుమల వెళ్లింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. తిరుమల దైవ దర్శనం సందర్భంగా నయన తార ఆలయ నిబంధనలు ఉల్లంఘించారు. చెప్పులతో తిరుమల మాఢ వీధుల్లో తిరిగారు.
అంతేకాదు! శ్రీవారి ఆలయం ముందు భర్త విగ్నేష్ శివన్‌తో ఫొటో షూట్ కూడా చేశారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారు. తిరుమల మాఢ వీధుల్లో పాద రక్షలు ధరించటం నిషేధం. నయన తార చెప్పులతో మాఢ వీధుల్లో తిరగటం చర్చనీయాంశంగా మారింది. అయితే, నయన తారతో పాటు చాలా మంది కాళ్లకు చెప్పులు ఉండటం గమనార్హం. కాగా, విగ్నేష్ శివన్ తమ కుటుంబాన్ని పెళ్లికి పిలవలేదంటూ విగ్నేష్ పెద్దమ్మ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విధితమే. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను విగ్నేష్ శివన్ సొంత పెద్దనాన్న భార్యను. ఈ రోజు పెళ్లని చెప్పారు. ఎలాగ ఉన్నా .. మమ్మల్ని పెళ్లికి పిలుస్తారని అనుకున్నా.
అతను రానేలేదు.. మమ్మల్ని పెళ్లికి పిలవలేదు. ఏదోలా ఉంది. మా ఇంటికి విందుకు వచ్చినా సంతోషపడతా.. అది జరుగుతుందో లేదో అర్థం కావటం లేదు. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనుకున్నా.. పెళ్లికి పిలిస్తే కచ్చితంగా పోవాలనుకున్నా. అది కూడా జరగలేదు. మేము అతని గురించి ఆలోచిస్తున్నాము.. కానీ, అతను మా గురించి అలా అనుకుంటున్నాడో లేదో.. చిన్నప్పుడు ప్రతీ సెలవులకు తండ్రితో కలిసి మా ఇంటికి వచ్చేవాడు. ఎంతకాదనుకున్నా వాళ్ల పెద్దనాన్న రక్తమే కదా.. వాళ్ల అమ్మానాన్న అయినా మాకు మర్యాద ఇవ్వాలని చెప్పాల్సింది. ఏం చెప్పారో తెలీదు. అతను రాలేదు. కుల దైవం గుడికి తీసుకుపోదాం అని నేనే చెప్పా.. కానీ, నన్ను తీసుకెళ్లకుండానే వాళ్లు వెళ్లారు. బాధగా ఉంది’’ అని అన్నారు. మరి, తిరుమల మాఢ వీధుల్లో నయనతార చెప్పులతో తిరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Mohan Lal: హైకోర్టులో మోహన్ లాల్ కు చుక్కెదురు.. 3 నుండి 7 ఏళ్ళవరకు జైలుశిక్ష పడొచ్చని వార్తలు!