నయనతార!.ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ హీరోయిన్.. దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలను మాత్రమే పోషించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించింది. తద్వారా నటిగా మంచి పేరును అందుకుంది. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇక, కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న నయన్.. పెళ్లిపై సంచలన నిర్ణయం తీసుకుందని తెలిసింది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గత ఐదేళ్లుగా ప్రేమాయణం నడిపిస్తోంది. నయనతార, విఘ్నేష్ శివన్ – ఈ జంట గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ.
ఈ మధ్య ఎక్కడ చూసినా ఏ గుళ్లో చూసినా కూడా నయన్, విఘ్నేష్ జంట కనిపిస్తుంది.పెళ్లి విషయంలో మాత్రం ఎందుకో దూరంగా ఉన్నారు. కావాలనే చేసుకోవడం లేదో లేదంటే అలా అయిపోతుందో తెలియదు కానీ ఐదేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ ఒక్కటి మాత్రం కాలేదు.ఈ ఏడాది ఎలాగైనా వివాహం చేసుకోవాలని విఘ్నేష్ శివన్‌తో పాటు ఆయన ఫ్యామిలీ ఫిక్స్ అయ్యారట. కానీ నయన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదని, కరోనా ఎఫెక్ట్ తగ్గాక వచ్చే ఏడాది వరకు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిందని కోలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న టాక్. పెళ్లి వాయిదా వేసుకుందామనే విషయాన్ని ఆమె విఘ్నేష్ కుటుంబంతో చెప్పిందని, విఘ్నేష్ కూడా అందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. సో ఈ ఏడాది నయనతార పెళ్లి ఉండకపోవచ్చనే టాక్ ముదిరింది.