దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. బహుబలి సినిమాలతో ఆయన రేంజ్ ఓ లెవెల్‌కు వెళ్లిపోయింది. సౌత్‌తో పాటు నార్త్ ఫ్యాన్స్ కూడా ఆయన నటనకు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా లేని మార్కెట్ ప్రభాస్‌కు ఏర్పడింది. ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలవారు. తన తోటి నటులకు ఎంతో గౌరవం ఇస్తారు. ప్రభాస్ ఇంట్రావర్ట్.. ఎక్కువగా ఇంటినుంచి బయటకు రారు. పరిచయం ఉన్నవారితో తప్ప బయటి వ్యక్తులతో ఎక్కువగా కలవరు. ఫంక్షన్లకు వచ్చినపుడు కూడా చాలా సైలెంట్‌గా ఉంటారు. ఇక, ప్రభాస్ మనస్తత్వం గురించి సౌత్ లేడీ అమితాబ్ నయనతార పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె తాజా చిత్రం కనెక్ట్ ప్రమోషన్లలో పాల్గొన్న నయనతార ప్రభాస్ గురించి ఫ్యాన్స్‌కు తెలియని విషయాలు చెప్పుకొచ్చారు. ప్రభాస్‌ది చిన్న పిల్లల మనస్తత్వం అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. యాంకర్ సుమతో జరిపిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యాంకర్ సుమ ప్రభాస్ గురించి నయనతారను అడగ్గా.. ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ ప్రభాస్ ఎంతో మంచి వాడు. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇప్పటికీ అలాగే ఉన్నాడో లేదో నాకు తెలీదు. నేను అతడితో పని చేసినపుడు మాత్రం అచ్చం చిన్నపిల్లాడిలాగా ప్రవర్తించేవాడు. అక్కడికీ ఇక్కడికీ గెంతేవాడు. జోకులు వేసేవాడు. అతడితో ఉండటం సరదాగా ఉండేది.
సెట్‌లో చిన్నపిల్లాడిలాగా ఎప్పుడూ ఎగురుతూ, దూకుతూ ఉండేవాడు. కానీ, ఇప్పుడు ప్రభాస్ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. అతడ్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. కాగా, నయనతార నటించిన కనెక్ట్ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. రౌడీ పిక్షర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ ఈ సినిమాను తెరకెక్కించారు. నయనతారతో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్‌లు ప్రధాన పాత్రలో నటించారు. మరి, ప్రభాస్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ నయనతార చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.