పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలు చేస్తూ ఉన్నారు. సినిమాలతో పాటు ఫ్యామిలీ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. భర్తతో కలిసి గుళ్లు, గోపురాలు, విదేశీ టూర్లు అంటూ తిరుగుతూ ఉన్నారు.
పెళ్లి తర్వాత నయనతార, విగ్నేష్ శివన్‌ల జంట లైఫ్‌ను చక్కగా ఎంజాయ్ చేస్తోంది. విదేశీ పర్యటనలతో పాటు గుళ్లు, గోపురాల చుట్టూ కూడా బాగా తిరుగుతోంది. ఈ ఇద్దరూ ప్రతి నెలా తమిళనాడులోని ఏదో ఒక గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా, నయనతార, విగ్నేష్‌లు కుంభకోణంలోని ఓ గుడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అంతేకాదు.. వీరితో ఫొటోలు దిగటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే నయనతారకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.
గుడిలో దర్శనం అనంతరం ఈ జంట అక్కడినుంచి వేరే చోటుకు బయలు దేరింది. ప్రయాణం కోసం నయనతార, విగ్నేష్‌లు ట్రైన్ ఎక్కుతూ ఉన్నారు. ఈ సమయంలో కొంతమంది ఫ్యాన్స్ ఆమెను తాకారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. వారి వైపు సీరియస్‌గా చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నయనతార, విగ్నేష్ శివన్‌లు ‘ నాను రౌడీదా’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. 2022లో ఓ గుడిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు.
పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల్లో నటిస్తున్నారు. అట్లీ దర్వకత్వంలో ఆమె ‘జవాన్’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు జంటగా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ఇరైవన్ అనే మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరి, తనను తాకుతూ ఇబ్బందిపెట్టిన ఫ్యాన్స్‌పై నయనతార ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.