తనను, తన పిల్లలను పట్టించుకోలేదని ప్రముఖ నటుడి భార్య ఆరోపణలు చేసింది. దాంతో ఖర్చుల కోసం చివరికి ఆ పని చెయ్యాల్సి వచ్చిందని సదరు నటుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ లు, విడాకులు సర్వసాధారణమైన విషయమే. కొంతకాలం ప్రేమలో మునిగితేలిన తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో ఇండస్ట్రీలో చాలా జంటలు విడిపోయాయి. ఇక పెళ్లి చేసుకున్న జోడీలు సైతం కొన్నాళ్లకు గొడవలు జరగడంతో తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం కూడా చూశాం. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా ఓ ప్రముఖ నటుడి భార్య.. తన భర్తపై మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు తన భర్తపై విరుచుకుపడింది నటుడి భార్య. డెలివరీ ఖర్చుల కోసం ఆ పని చెయ్యాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
గత కొంత కాలంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన నవాజుద్దీన్ సిద్దిఖీకి అతడి భార్య ఆలియాకు మధ్య వివాదాలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ వివాదాల కారణంగానే గత కొంత కాలంగా ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నవాజుద్దీన్ అంత మంచి వాడు కాదని, తనను మానసికంగా వేధించాడని, అన్నం కూడా పెట్టలేదని కొన్ని రోజుల క్రితం ఆలియా ఆరోపణలు చేసింది. తాజాగా మరో వీడియోను ఆలియా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో..”నేనంటే విలువలేని మనిషి కోసం నా లైఫ్ లోని 18 సంవత్సరాలరు కేటాయించినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. 2004లో మెుదటిసారి నవాజ్ ను కలిశాను. అప్పట్లో నేను, నవాజ్ ఆయన సోదరుడు ఓ చిన్న ఇంట్లో ఉండే వాళ్లం. దాంతో తను నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మి, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అని మూర్ఖంగా నమ్మాను. 2010లో పెళ్లి చేసుకున్న మాకు సంవత్సరానికే నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. ఆ సమయంలో నా డెలివరీ ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో.. మా అమ్మ ఇచ్చిన ప్లాట్ ను అమ్మాను” అని చెప్పుకొచ్చింది.
ఇక ఆ సమయంలో నవాజ్ కు ఓ కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఆలియా పేర్కొంది. అయితే అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని ఆమె అన్నారు. అతడు పిల్లల్ని కూడా సరిగ్గ చూసుకునే వాడు కాదని ఆమె ఆరోపించింది. ఇంతకాలం తర్వాత నాపై అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. తొలి బిడ్డ పుట్టిన తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం కూడా చేసినట్లు ఆలియా చెప్పుకొచ్చింది. నవాజ్ మాటలు నన్ను మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టాయని భావోద్వేగానికి లోనైంది ఆలియా. మరి నవాజుద్దీన్ సిద్దిఖీ-ఆలియా మధ్య వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.