సినిమా పరిశ్రమకు సినిమా నేపథ్యం లేకుండా వెళ్లిన వారికి అవకాశం రావడమంటే చాలా కష్టం.ఆ అవకాశం కొరకు మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ అవకాశం వస్తే దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది. ఇక మిమ్మల్ని పరిశ్రమలో ఎవరు ఆపలేరు. అదృష్టం బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు. ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయిన నటులలో ముందువరుసలో ఉంటాడు హీరో నాని. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఇప్పుడు నాని హిందీ సినిమాల మీద దృష్టి పెట్టినట్లు అనిపిసోంది కదూ అతని మాటలు వింటూంటే!.. నేను హిందీ మాట్లాడగలను కానీ, బాలీవుడ్ సినిమా చేసేందుకు నాకొచ్చిన హిందీ సరిపోదు. హిందీ సినిమా చేయాలంటే కథ నాకు బాగా నచ్చి, ఆ పాత్ర కోసం కష్టపడి హిందీపై పట్టు సాధించాలని నాకు అనిపించాలి. నాని బాలీవుడ్‌కి కొత్త అనే ఫీలింగ్ ప్రేక్షకులకు రాకుడదు. అలాంటి ప్రాజెక్ట్ వస్తే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తా’ అని తన మనసులోని మాటను బయటపెట్టాడు నాని. నాని నటించిన V సినిమా గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో నేరుగా రిలీజైంది. ఇప్పుడా సినిమా హిందీలోకి కూడా డబ్ అవ్వబోతోంది. బహుశా ఈ సినిమాకొచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాని, తన బాలీవుడ్ ప్లాన్స్ కు మరింత మెరుగులు దిద్దుతాడేమో చూడాలి. ‘టక్ జగదీశ్’ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 70శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని తెలిపాడు నాని.