న్యాచురల్ స్టార్ నాని.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించినా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన తర్వాతి సినిమా ‘టక్ జగదీష్’ నుంచి ట్రైలర్ రిలీజయింది. ఎప్పటిలానే నాని యాక్షన్, ఎమోషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. టక్ జగదీష్ ఓటీటీ ఎంట్రీపై చాలానే కాంట్రవర్సీలు జరిగాయి. తాజాగా వాటిపై హీరో నాని కాస్త భావోద్వేగంగానే స్పందించాడు.
టక్ జగదీష్ ప్రెస్‌మీట్‌లో సినిమా విశేషాలను నాని పంచుకున్నాడు. ఈ సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని గొప్పలు చెప్పను కానీ, మీరు చిన్నప్పటినుంచి చూసి పెరిగిన సినిమా, ఈరోజుల్లో కనిపించని సినిమాని మళ్లీ చూస్తారని నాని హామీ ఇచ్చాడు. పండగరోజు ప్రతిఒక్కరు మంచి కుటుంబ కథా చిత్రాన్ని చూస్తారని చెప్పాడు. ప్రతి ఇంట్లో సినిమా చూశాక అందరికీ ఆనందబాష్పాలు వస్తాయన్నాడు నాని. విలేకరులు థియేటర్ యజమానుల వ్యాఖల గురించి ప్రస్తావిచగా.. ‘అందరూ పెద్దవారు, ప్రస్తుతం వారి పరిస్థితులను బట్టి అలా అన్నారు. నన్ను బ్యాన్ చేస్తానని కూడా అన్నారు. నేను మీలోని వాడినే.. నన్ను వేరుచేసి మట్లాడారని తెలిసి కాస్త బాధేసింది. బయట పరిస్థితులు బాగుండి నే సినిమా థియేటర్‌కి రాకపోతే నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా అంటూ నాని కూడా భావోద్వేగంగా సమాధనమిచ్చాడు.
ఈ సినిమా సెప్టెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. టక్ జగదీష్‌లో జగపతిబాబు, నానికి అన్నగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. ‘నిన్ను కోరి’ హిట్ తర్వాత నాని- నిర్వాణ కాంబోలో వస్తున్న చిత్రమిది.