మొత్తం ఐదు విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సూర్య, నటిగా అపర్ణ నిలిచారు. జాతీయ అవార్డులు గెలుచుకున్నవారు త్వరలో భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. విజేతలకు అవార్డు, సర్టిఫికేట్‌తో పాటు కొంత నగదును కూడా బహుమానంగా ఇవ్వననున్నారు. క్యాటగిరీల ప్రకారం ఈ నగదు బహుమతిలో తేడాలుంటాయి. స్వర్ణ కమల్ క్యాటగిరీలో అవార్డు గెలుచుకున్న వారికి రూ. 75,000నుంచి రూ. 2,50,000 దాకా నగదు బహుమతి అందిస్తారు.
ఇక, రజత్ కమల్ క్యాటగిరీలో అవార్డు గెలుచుకున్న వారు… ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ బాల నటులు, ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్ తదితర విభాగాలకు సంబంధించి రూ. 50,000 నుంచి రూ.75,000 నగదు బహుమతి అందిస్తారు. మరి, నేషనల్ అవార్డ్ విజేతల నగదు బహుమతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 68 National Film Awards: 68వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన!