Any Movie Tickets For RS 75: సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. నేషనల్ సినిమా డే సందర్భంగా సినిమా టిక్కెట్ల ధరను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ఏ సినిమా టిక్కెట్ అయినా రూ. 75కే అందించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 16న దేశ వ్యాప్తంగా నేషనల్ సినిమా డే జరగనుంది. అంతేకాదు! కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం థియేటర్లు అన్నీ కోలుకుని మామూలు స్థితికి వచ్చాయి. సక్సెస్ ఫుల్‌గా సినిమాలను ఆడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
దాదాపు 4వేల థియేటర్లు ఆ రోజున 75 రూపాయలకే సినిమా టికెట్లు అమ్మనున్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపాలిస్, కార్నివాల్, మిరాజ్, సిటీప్రైడ్, ఎషియన్, ముక్త ఏ2, మూవీ టైం, వేవ్, ఎమ్2కేడిలైట్ వంటి మల్టీప్లెక్స్‌లు ఈ ధరకే సినిమా టికెట్లు అందించనున్నాయి. కాగా, కరోనా కారణంగా చాలా థియేటర్లు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించి థియేటర్లకు అనుమతి ఇచ్చినా జనం సినిమా చూడ్డానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా నార్త్‌లో సరైన హిట్లు లేక జనం సినిమా థియేటర్లకు వెళ్లటం మానేశారు. ఈ నేపథ్యంలో సౌత్‌నుంచి వెళ్లిన ‘పుష్ప’ సంచలనం సృష్టించింది.
మౌత్ టాక్‌తో ముందుకు దూసుకెళ్లింది. జనం సినిమా చూడ్డానికి ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలతో నార్త్ థియేటర్లు కలకల్లాడాయి. థియేటర్స్ ఓనర్ అసోసియేషన్ కూడా సౌత్ సినిమాలను మెచ్చుకుంది. జనం థియేటర్లకు రావటానికి కారణం సౌత్ సినిమాలేనని కొనియాడింది. మరి, నేషనల్ సినిమా డే సందర్భంగా సినిమా టిక్కెట్లు 75 రూపాయలకే అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అమల మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున!