ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ నటులు, నిర్మాతలు, దర్శకులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
సినీ పరిశ్రమంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సింగర్, జాతీయ అవార్డు గ్రహీత శివమోగ సుబన్న గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి సింగర్ గా ఆయన మంచి గుర్తింపు పొందారు. ‘కాడు కుదురె’ మూవీలోని కాడు కుదురె ఒడి బండిట్టా పాటకు శివమోగ సుబన్న అవార్డు అందుకున్నారు.
ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ఆయన జానపద గేయాలు, పద్యాలు పాడటంలో దిట్ట. కెరీర్ బిగినింగ్ లో సుబన్న ఆకాశవాణి, దూరదర్శన్లోనూ పనిచేశారు. సుబన్న మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.