టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఒక్క వెలుగు వెలిగారు రాకేష్ మాస్టర్. ఈ నెల 18న అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ శిష్యులే.
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమంలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. గత ఏడాది ప్రముక నటుడు శరత్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ దుఖఃం నుంచి కోలుకోకముందే.. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈ నెల 18న అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీలో ఎంతోమందికి డ్యాన్స్ నేర్పించిన చివరి రోజుల్లో పలు వీడియోలు చేస్తూ జీవితం గడిపారు. ఈ రోజు ఆయన దశదిన కర్మ నిర్వహించారు. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ కి సంతాపసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన శిష్యులు. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈ నెల 18న అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో కన్నుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ ఆయన శిష్యులే. అందుకే రాకేష్ మాస్టర్ అంత్యక్రియలకు హాజరై ఘన నివాళులు అర్పించి ఆయన పాడె మోశారు. కొంతకాలం క్రితం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. సొంత యూట్యూబ్ ఛానల్ ఓపేన్ చేసి వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు రాకేష్ మాస్టర్. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ రోజు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తమ సొంత ఖర్చులతో రాకేష్ మాస్టర్ దశదిన కర్మను పెద్ద ఏత్తున చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు.
రాకేష్ మాస్టర్ పెద్దకర్మలో భాగంగా ఆయన భార్య, కొడుకు, కూతురు పాల్గొన్నారు. ఈ సంతాప సభలో సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి హాజరయ్యారు. గతంలో రామ్, ఇలియానా జంటగా నటించిన ‘దేవదాసు’ మూవీలో రాకేష్ మాస్టర్ నాలుగు సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశారు. ఇక రాకేష్ మాస్టర్ కోసం ఆయన శిష్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ పేరిట ప్రతి సంవత్సరం జాతీయ పురస్కారాన్ని నెలకొల్పనున్నారు. ఎంతోమంది ఔత్సాహికులకు డ్యాన్స్ నేర్పించి ప్రయోజకులను చేసిన రాకేష్ మాస్టర్ ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఈ జాతీయ పురస్కారాన్ని ప్రతిఏటా అందించడానికి సిద్దమయ్యారు.
ఈ సందర్భంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ బుధవారం హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఈ విషయాన్ని అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సందర్భంగా నాగబాల సురేష్ మాట్లాడుతూ.. ‘రాకేష్ మాస్టర్ సంస్మరణ సభలో ఏదో ఆయన ఫోటోకు పూలదండలు వేసి వెళ్లిపోవడం కాదు.. తెలుగు వారి గుండెల్లోనే కాదు యావత్ భారతీయుల గుండెల్లో రాకేష్ మాస్టర్ ఎల్లకాలం గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. మాస్టర్ పేరు మీద ఒక జాతీయ అవార్డు నెలకొల్పాలి అని నేను సత్య మాస్టర్‌కు చెప్పాను. సత్య మాస్టర్ ఆధ్వర్యంలో శేఖర్ మాస్టర్ సహకారంతో వైవీఎస్ చౌదరి ప్రోద్భలంతో ఈ వేధిక ద్వారా ఆ మహానుబావుడి పేరు మీద జాతీయ పురస్కారం ప్రతి ఏటా అందజేస్తారని ప్రకటిస్తున్నా’ అని అన్నారు.