బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్(నాటో) సంస్థ సంచలన లేఖ రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది. పాన్ మసాలాలో పొగాగు ఉంటుందని… ఇది ప్రజలను వ్యసనపరులుగా మారుస్తుందని… దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది.
దేశంలో ఎంతో మంది యువత పొగాగు కి బానిసలు గా మారి వాతావరణ కాలుష్యమే కాదు.. తమ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి వాణిజ్య ప్రకటనల నుంచి అమితాబ్ వీలైనంత త్వరగా తప్పుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ లేఖ రాశారు. కాగా, అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారని… అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు.
అందుకే వెంటనే అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలి. అప్పుడు పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఈ లేకలో కోరినట్లు సమాచారం. అంతే కాదు పాన్ మసాల క్యాన్సర్ కారకంగా పని చేస్తోందనే విషయం పరిశోధనల్లో తేలిందని, అందులోని పదార్ధాలు నోటి క్యాన్సర్‌కు దారి తీస్తాయంటూ శేఖర్ సల్కర్ తన లేఖలో రాసుకొచ్చారు. ప్రజా ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ యాడ్ విషయం గురించి అమితాబ్ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరి ఈ లేఖపై అమితాబ్ ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది వేచి చూడాలి.