ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట ఎక్కడికి వెళ్లినా పెద్ద న్యూస్ అవుతుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి మెలిసి తిరుగుతున్నారు.. ఈవెంట్స్, దేవుడి గుళ్లకు జంటగా వెళ్తున్నారు. ఆ మద్య త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో కూడా షేర్ చేశారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. శుక్రవారం ఉదయం నరేష్ తన ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేయడంతో మొత్తానికి ఇన్నాళ్లకు వివాహబంధంతో ఒక్కటయ్యారని శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు. గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి జంటగా ప్రతి ఈవెంట్స్ కి వెళ్తున్నారు. నరేష్, పవిత్ర ల ప్రేమ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు ఇది నిజమైన పెళ్లా.. లేక ఏదైనా షూటింగ్ కోసమా అన్న విషయం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు నరేష్ స్పందించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ఉదయం నుంచి తెగ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. తాజాగా నరేష్ నటించిన ‘ఇంటింటి రామాయణం’ అనే వెబ్ సీరీస్ త్వరలో రిలీజ్ కి సిద్దంగా ఉంది.. దీనికి సంబంధించిన ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నరేష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియా నరేష్ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చింది. మనం ఇక్కడికి వచ్చింది సినిమా విషయం మాట్లాడటానికి అంటూ పెళ్లి విషయాన్ని దాటవేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీ పెళ్లి విషయమే హాట్ టాపిక్ గా ఉందని.. పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారని మరోసారి ప్రశ్నించగా.. ఇక ఈ విషయం డైవర్ట్ చేయదల్చుకోలేదు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియాకు తప్పకుండా తెలియపరుస్తా.. ఈ విషయం అందరికీ తెలిసిందే. త్వరలో దానికి సంబంధించిన విషయం కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెబుతాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అన్నారు.
సెలబ్రెటీలకు రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఒకటి ఉంటుంది. నా లైఫ్ ని నేను జీవిస్తున్నాను.. నాకు ప్రైవసీ కావాలి అంటూ ప్రస్తుతానికి తన పెళ్లి ప్రస్తావనకు ఫులిస్టాప్ పెట్టారు నరేష్. కానీ ఉదయం ఆయన షేర్ చేసిన పెళ్లి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా నరేష్, పవిత్ర లు కలిసే ఉంటున్నారు.. దేవుళ్ల గుడికి, ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్ కి కలిసి వెళ్తున్నారు. ఆ మద్య త్వరలో తాము పెళ్లి చేసుకోబుతున్నామని వీడియో కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. మరి నరేష్, పవిత్రల పెళ్లి వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.