నరేష్-పవిత్రా లోకేష్ జంట.. టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్ సంపాదించింది! రీసెంట్ గా పెళ్లి చేసుకున్నట్లు షాకిచ్చిన ఈ జోడీ.. దానికి గల కారణాన్ని ఇప్పుడు స్వయంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటీనటులు నిజ జీవితంలో పెళ్లి చేసుకోవడం సాధారణ విషయమే. ఒకటి కంటే ఎక్కువసార్లు మ్యారేజ్ చేసుకోవడం అనేది కూడా ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంది. దీని గురించి కొందరు పట్టించుకుంటే.. మరికొందరు మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇదంతా పక్కనబెడితే ఏకంగా నాలుగో పెళ్లి చేసుకుని అందరూ అవాక్కయ్యేలా చేసిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే నరేష్ అని చెబుతారు. నటి పవిత్రా లోకేష్ ని మ్యారేజ్ చేసుకున్నట్లు రీసెంట్ గా ఓ వీడియో రిలీజ్ చేసిన ఈ నటుడు.. ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు అదంతా దేని కోసమనేది బయటపడింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్, ‘జంబలకిడి పంబ’తోపాటు చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం స్టార్స్ నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతిఒక్కరి మూవీలోనూ దాదాపు నటిస్తున్నాడు. ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత హీరోగానూ పలుసినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వ్యక్తిగతంగానూ నరేష్, గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో ఉంటున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్రా లోకేష్ తో కలిసుండటం పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది న్యూయర్ సందర్భంగా పవిత్రా లోకేష్ ని ముద్దు పెడుతున్న వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నరేష్.. అందరూ అవాక్కయ్యేలా చేశాడు. కొన్ని రోజుల ముందు పెళ్లి చేసుకున్నట్లు, హనీమూన్ కోసం దుబాయి వెళ్లినట్లు వరస వీడియోలను రిలీజ్ చేశాడు. ఇదంతా చూసి చాలామంది నిజం అనుకున్నారు. కానీ అదంతా ‘మళ్లీ పెళ్లి’ అనే మూవీ కోసం అని ఫైనల్ గా రివీల్ చేశారు. రియల్ లైఫ్ కపుల్ అయిన నరేష్-పవిత్ర.. ఈ సినిమాలో కపుల్ గా అంటే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. MS రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను వేసవిలో థియేటర్లలోకి తీసుకురానున్నారు. మరి నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ పోస్టర్ చూడగానే మీకేం అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
#MalliPelli #MattheMaduve ❤️ pic.twitter.com/eqxa2TVELb
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023