నరేశ్– పవిత్రా లోకేశ్– రమ్య రఘుపతి ఇప్పుడు వీరి వివాదంలో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది.. అదే రాకేశ్ శెట్టి. ఈ పేరు చెబుతూ యాక్టర్ నరేశ్ పలు సంచలన ఆరోపణలు చేశాడు. “రాకేశ్ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉంది. వాళ్లు పథకం ప్రకారమే మమ్మల్ని బ్లాక్ మెయిల్, దాడి చేస్తున్నారు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు” అంటూ నరేశ్ మైసూరులో తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పటి నుంచి అసలు ఎవరీ రాకేశ్ శెట్టి అని సోషల్ మీడియాలో వెతుకులాట మొదలైంది.
అసలు ఏం జరిగిందంటే.. నరేశ్- పవిత్రా లోకేశ్ మైసూర్ లో ఓ హోటల్ గదిలో ఉన్నారు. వాళ్లిద్దరూ హోటల్ లో ఉండగా రమ్య రఘుపతి పోలీసులను తీసుకుని అక్కడకు చేరుకుంది. వాళ్లిద్దరూ ఒకే గదిలో ఎలా ఉంటారంటూ రమ్య ప్రశ్నించింది. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది కూడా. పోలీసులు ఆమెను వారించి.. నరేశ్, పవిత్రలను అక్కడి నుంచి పంపేశారు. ఆ తర్వాత కారు ఎక్కుతూ నరేశ్ ఈ ఆరోపణలు చేశాడు. రాకేశ్ శెట్టితో రమ్యకు అక్రమ సంబంధం ఉంది అంటూ నరేశ్ ఆరోపించాడు.
రమ్య రఘుపతి ఇతడిని అడ్డుపెట్టుకునే తనపై ఆరోపణలు చేస్తోందంటూ నరేశ్ విమర్శించాడు. రమ్య పలు ఛానళ్లను కొనుగోలు చేసి కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తోంది అంటున్నాడు. ఈ రాకేశ్ శెట్టి ఎవరంటే.. కన్నడ పవర్ న్యూస్ ఛానల్ ఎండీగా వ్యవహరిస్తున్నాడు. అతను, రమ్య కలిసే కావాలని పథకం ప్రకారం తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు నరేశ్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, నరేశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నరేశ్ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.