టాలీవుడ్లో ఈమధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన అంశాల్లో సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేష్ వ్యవహారం ఒకటి. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన నరేష్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలయ్యారు. చిన్న క్యారెక్టరా పెద్దదా అనే తేడాల్లేకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ ఆయన బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పవిత్రా లోకేష్ తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి నరేష్-పవిత్రలు ఒకర్నొకరు ఇష్టపడటం, వీళ్లిద్దరూ కలసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలో నటించడం తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పవిత్రతో కలసి నరేష్ డ్యాన్స్ చేయడం, ఒకర్నొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారాయి.
పవిత్రతో తనకు ఉన్న రిలేషన్షిప్ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న నరేష్.. తాజాగా ఆమెతో పిల్లల్ని కనడం మీదా స్పందించారు. తాము ఇద్దరమూ శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని ఆయన బోల్డ్ కామెంట్స్ చేశారు. తనకు, పవిత్రకు ఉన్న పిల్లలందరూ సమానమేనని నరేష్ చెప్పుకొచ్చారు. అయితే భవిష్యత్తులో ఏంటనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఎమోషనల్ రిలేషన్షిప్ చాలా పవర్ఫుల్ అని తెలిపారు. ‘మా అమ్మ నన్నెప్పుడూ ఒకటే కోరుకునేది. తన లాంటి భార్యను నాకు ఇవ్వలేకపోయాననేది. ఇప్పడు నా లైఫ్‌లోకి పవిత్ర వచ్చింది. అమ్మ పుట్టిన రోజే పవిత్ర బర్త్ డే కూడా. ఇద్దరికీ కొన్ని పోలికలూ ఉన్నాయి. వాళ్లిద్దరి కళ్లూ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు నేను తన బిడ్డను, తను నా బిడ్డ. మా ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ హ్యపీగా ఉంటాం’ అని నరేష్ వివరించారు.