తెలుగు సినిమా దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన 80 ఏళ్ల వయసులో పరమపదించారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావటంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాలు తెలియజేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని తదితరులు కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణ మరణంపై స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. ‘‘ కృష్ణ ఓ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్. తనదైన శైలి నటన, వ్యక్తిత్వంతో ఎంతో మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. మహేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Krishna Garu was a legendary superstar, who won hearts of people through his versatile acting and lively personality. His demise is a colossal loss to the world of cinema and entertainment. In this sad hour my thoughts are with @urstrulyMahesh and his entire family. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ తెలుగు సినిమా సూపర్ స్టార్, ఘట్టమనేని కృష్ణ మరణం ఎంతో విషాదకరం. కృష్ణగారి క్రమ శిక్షణ, పనిలో విలువలు ప్రజలందరూ ఎలా ఉండాలనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన కుటుంబానికి, మిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Deeply saddened by the news of the passing away of Telugu cinema superstar, Ghattamaneni Krishna ji.
His unmatched professional discipline and work ethics set an example on conduct in public life. My heartfelt condolences to his family, friends and fans. pic.twitter.com/cO83w8kNiT
— Rahul Gandhi (@RahulGandhi) November 15, 2022