Narasimha: సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చేశారు. అలాంటి వాటిలో నరసింహ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయం. శివాజీ గణేషన్ గాంభీర్యం, రజినీకాంత్ స్టైల్, సౌందర్య అమాయకత్వం, రమ్యకృష్ణ గర్వం కలగలిపిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. రజినీకాంత్, రమ్యకృష్ణల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలకు చప్పట్లు కొట్టక తప్పదు. వీరిద్దరి మధ్య డైలాగులు కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే, బయటకు కనిపించినంత ఈజీగా రమ్యకృష్ణ ఆ నటనను అందించలేదు. తెరవెనుక చాలానే కష్టాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా వసుంధర, నీలాంబరి కాళ్లకు గోరింటాకు పెడుతున్న సీన్‌లో. ఆ సీన్‌లో వసుంధర, నీలాంబరి కాళ్లకు గోరింటాకు పెడుతుంటుంది.
నీలాంబరి తన కాలితో వసుంధర చెంపపై తడుతూ డైలాగ్స్ చెబుతుంటుంది. ఆ సీన్‌లో నటించటానికి, సౌందర్యను కాలితో ముఖంపై కాలు పెట్టడానికి రమ్యకృష్ణ చాలా భయపడ్డారంట. కాలితో తన్ననని, తనకు మంచిదికాదని అన్నారంట. రజినీకాంత్, కేఎస్ రవికుమార్ ఎంత చెప్పినా ఆమె వినలేదంట. ఏడుస్తూ ఉన్నారంట. అయితే, సౌందర్యే స్వయంగా రమ్యకృష్ణ కాలిని ముఖం దగ్గర పెట్టించుకుని, ఏం కాదని చెప్పి నటించేలా చేశారంట. ఈ విషయాలను కేఎస్ రవికుమార్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరి, ఈ సీన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రశాంత్ నీల్- Jr.NTR సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న కమల్ హాసన్!