Taraka Ratna Death News: 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న నందమూరి తారకరత్న శనివారం నాడు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబ సభ్యుడు నారా లోకేష్ కూడా.. తన బావ మరణం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
గత 23 రోజులుగా తెలుగు ప్రజలు చేసిన ప్రార్ధనలు వృథా అయ్యాయి. తన ఇంటి బిడ్డని బతికించుకోవడానికి నందమూరి బాలకృష్ణ చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాటం చేసి అలిసిపోయిన తారకరత్న ఈ శనివారం సాయంత్రం తిరిగిరాని లోకాలకు పయనం అయ్యారు. మృదు స్వభావి, కల్మషం ఎరుగని తారకరత్న మృతితో.. ఆయన కుటుంబ సభ్యులే కాక, యావత్ తెలుగు వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇక తారకరత్న మృతిపై సెలబ్రెటీలు అంతా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబ సభ్యుడు నారా లోకేష్ కూడా.. తన బావ మరణం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
గుండెల నిండా బాధని నింపుకున్న నారా లోకేష్.. “నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. నీకు కన్నీటి నివాళి అర్పిస్తూ, నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయాయి. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తారకరత్న మృతిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నందమూరి తారకరత్న మరణ వార్త నాకు తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, ఫలితాన్ని ఇవ్వలేదు, ఇది మా అందరికీ తీరని లోటు” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక తారకరత్న ఇంత చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడం అందరిని కలిచి వేస్తోంది.
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G
— Lokesh Nara (@naralokesh) February 18, 2023
నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 18, 2023