Nara Lokesh: ప్రముఖ వ్యాపారవేత్త, ఫోనిక్స్ గ్రూపు ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ 60వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో సెలెబ్రిటీలు సందడి చేశారు. సినీ, రాజకీయాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, దగ్గుబాటి వెంకటేష్, త్రిమిక్రమ్, మోహన్ బాబు, మంచు విష్ణు దంపతులు, శరత్ కుమార్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. ఇక రాజకీయాలనుంచి నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, రామ్మోహన్‌నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్, మోహన్ బాబుల కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బర్త్‌డే పార్టీకి హాజరైన వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఎంతో ప్రేమతో పలకరించుకున్నారు. కొద్ది సేపు సరదాగా చమక్కులు విసురుకున్నారు. ఇంతలో అక్కడికి మంచు విష్ణు కూడా వచ్చాడు. విష్ణు లోకేష్‌ను పలకరించగా.. లోకేష్ అతడ్ని ఆలింగనం చేసుకుని విష్ చేశారు. ప్రస్తుతం మంచు తండ్రీకొడుకులతో నారా లోకేష్ సరదాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కొద్దిరోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు, మంచు మోహన్ బాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు.
ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆ భేటీ కొనసాగింది. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలుసుకోవటంతో ఆ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోహన్‌బాబు టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి, మంచు తండ్రీకొడుకులతో నారా లోకేష్ సరదాగా మాట్లాడిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మంచు లక్ష్మికి అరుదైన గౌరవం! దేశంలోనే అందమైన మహిళ అట!