ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తే.. అక్కడి వాతావరణంలో ఏర్పడే సందడే వేరుగా ఉంటుంది. సినిమా స్టార్స్ ని ఎలాగైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. సినిమాలకు సంబంధం లేకపోయినా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీలు ఎదురైతే మాత్రం ఆ సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఇటీవల హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ మొదలైన సంగతి తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహిస్తున్న ఈ రేసింగ్ ని చూసేందుకు వారవారం ఔత్సాహికుల సంఖ్యతో పాటు సెలబ్రిటీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదివరకే ఈ ఫార్ములా రేసింగ్ ని చూసేందుకు స్టార్ హీరోలు రామ్ చరణ్, నాగచైతన్య గతంలో వెళ్లి సందడి చేశారు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. మొదటిసారి హైదరాబాద్ లో ఈ రేసింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయని తెలిసి.. చుట్టూపక్కల ప్రాంతాల నుండి కూడా వీక్షకులు తండోపతండాలుగా పాల్గొంటున్నారు.
ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తే.. అక్కడి వాతావరణంలో ఏర్పడే సందడే వేరుగా ఉంటుంది. సినిమా స్టార్స్ ని ఎలాగైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. సినిమాలకు సంబంధం లేకపోయినా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీలు ఎదురైతే మాత్రం ఆ సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తాజాగా హైదరాబాద్ ఫార్ములా రేసింగ్ వద్ద అలాంటిదే జరిగింది. మాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబు కోడలు, నారా లోకేష్ సతీమణి.. బ్రాహ్మణి మోడరన్ డ్రెస్ లో ఫార్ములా రేసింగ్ చూసేందుకు హాజరైంది. ఆమెతో పాటు తన కుమారుడిని సైతం వెంటపెట్టుకొని వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మోడరన్ లుక్ లో నారా బ్రాహ్మణి ఎంట్రీ చూసి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సినీ ప్రేక్షకులకు నారా బ్రాహ్మణి.. నటసింహం బాలకృష్ణ కూతురిగా సుపరిచితమే. కానీ.. సినిమాలలోకి రాలేదు గాని.. హీరోయిన్స్ ని మించిన అందంతో బ్రాహ్మణి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఓవైపు మోడరన్ బిజినెస్ విమెన్ గా, మరోవైపు నారా ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అప్పుడప్పుడు ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటుంది బ్రాహ్మణి. అయితే.. ఇప్పుడు హైదరాబాద్ ఫార్ములా రేసింగ్ వద్ద ఆమె కనిపించేసరికి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఈ రేసింగ్ ని చూడటానికి మహేష్ బాబు భార్య నమ్రత, జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి కూడా హాజరైనట్లు సమాచారం. మరి హైదరాబాద్ లో ఈ రేసింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
.@tarak9999 wife #LakshmiPranathi and @naralokesh wife #Brahmani Nandamuri at #FormulaE Racing, Hyderabad pic.twitter.com/2iCE6t4pqX
— SumanTV (@SumanTvOfficial) February 10, 2023