'దసరా' నుండి 'ఓరి వారి' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ లో పాల్గొన్న హీరో నాని.. మీడియా అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాడు. పుష్పలో అల్లు అర్జున్ తో పోల్చుతున్న ట్రోల్స్ పై నాని స్పందించాడు.
నేచురల్ స్టార్ నాని.. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి డిఫరెంట్ సినిమాల తర్వాత ‘దసరా’ అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అని ఓ నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. నాని సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ని మెల్లగా స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి ‘ఓరి వారి’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ లో పాల్గొన్న హీరో నాని.. మీడియా అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాడు.
ఇక ఈ సినిమాలో మీ లుక్ చూసి పుష్పలో అల్లు అర్జున్ తో పోల్చుతున్నారు. అలాగే పుష్పలాగే ట్రై చేశారంటూ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మీరేమంటారు? అనే ప్రశ్నకు నాని స్పందించి.. “మనకు ఈ పదేళ్లలో ఓ ఐదు వందల సినిమాలు వచ్చాయి అనుకోండి. అందులో 495 సినిమాలలో హీరోలంతా ప్యాంటు, షర్ట్ లోనే కనిపిస్తారు. అలాగని వాళ్ళనెప్పుడు సేమ్ లుక్ అని అనలేం. లుంగీ, బన్యన్ లతో రూరల్ సినిమాలు చాలా రేర్ గా చేస్తుంటాం. లాస్ట్ టైమ్ బన్నీతో సుకుమార్ పుష్ప తీశారు. ఇక్కడ అలాంటి గెటప్ కలిసేసరికి సేమ్ అనేస్తున్నాం. ఎందుకంటే.. ఇలాంటివి ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి ఉంటే.. ఈ కంపారిజన్స్, రిఫరెన్స్ లు ఉండేవి కాదు” అని చెప్పాడు.
ఆ తర్వాత మీడియా వ్యక్తి ఒకరు.. దసరాని ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ల రేంజ్ సినిమా అని ఎలా పోల్చగలిగారు? అని అడిగారు. దీనిపై నాని రియాక్ట్ అవుతూ.. “ఈ ప్రశ్నపై నేను అందరికి క్లారిటీ ఇవ్వాలి. మేం ఏం చెప్తామో అది కొన్నిసార్లు కాపీ పేస్ట్ చేసేసి మరో రకంగా తీసుకుంటారు. నేను క్లియర్ గా చెప్పింది ఏంటంటే.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాగా అంటే 500 కోట్లు, 1000 కోట్లు చేస్తాయా అనేది కాదు.. అవి ఆయా ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలు. నేను వాటిలాగా ఉంటాయనో.. ఆ సీన్స్ ఉంటాయనో అనట్లేదు. ప్రతి ఏడాది ఒక్కో ఇండస్ట్రీ నుండి ఇది మా ఇండస్ట్రీ మూవీ అని, ఇది మేము చేశాం అని చెప్పుకునే సినిమాలు ఉంటాయి. అలా లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు వచ్చినట్లే.. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుండి దసరా రాబోతుందని అంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నాని మాటలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.