నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "దసరా" మూవీలో నాని నటించారు. నానికి జోడిగా కీర్తి సురేష్ నటించారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది.
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా” మూవీలో నాని నటించారు. నానికి జోడిగా కీర్తి సురేష్ నటించారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. విడులైన రెండు రోజుల్లోనే మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం దసరా మూవీకి తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో కొందరు నాని పరువుపోయిందంటూ విమర్శలు చేశారు. అయితే అసలు పరువుపోయింది టాలీవుడ్ దని, మనం సిగ్గుపడాలని కొందరు నానికి మద్దతుగా మాట్లాడుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాని..ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టి..నేడు టాప్ హీరో రేంజ్ కి చేరుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో నాని ఎప్పుడు ముందుటారు. అందులో భాగంగానే దసరా సినిమాలో ప్రత్యేకంగా కనిపించారు. అలానే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలు సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి.
అలానే తాజాగా నాని నటించిన దసరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. దేశ వ్యాప్తంగా 100 కోట్లపైనే గ్రాస్ వసూలు రాబట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ లో దసరా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దసరా మూవీ ఊచకోత కోసింది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో దసరా మూవీ ఆడలేదు. కలెక్షన్లు కూడా దారుణంగా వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. బాలీవుడ్ లో దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో బాలీవుడ్ నాని పరువు పోయిదంటూ కొందరు విమర్శలు చేశారు.
అయితే వాస్తవానికి పరువుపోయింది నానిది కాదని, తెలుగు వారిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని.. స్వయం కృషితో స్టార్ హీరో రేంజ్ ఎదిగాడు. అలానే రాజమౌళి,ఇతర పెద్ద పెద్ద నిర్మాతలు నాని మూవీకి ప్రమోషన్లు చేయలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలకు ప్రమోషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే అలాంటి ప్రమోషన్లు నాని దసరా మూవీలో కనిపించలేదు.
టాప్ హీరోల సినిమాలు ప్రమోషన్ చేసే టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు నాని సినిమాకు చేయలేదని, ఆయనను అనాథను చేశారని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ మిగిలిన హీరోల మాదిరిగానే నాని సినిమాకు బాలీవుడ్ లో ప్రమోషన్ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. నానిని ఇండస్ట్రీలో అనాథను చేశారమో, అందుకే ఆయన సినిమా ప్రమోషన్ ఎవరు చేయలేదని కొందరు సందేహం వ్యక్తం చేశారు. నాని పరుపోయిందనే విమర్శలు చేసేవారు.. టాలీవుడ్ పరుపోయిందని తెలుసుకోవాలని కొందరు అంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీని దాటి బయటకు వెళ్లిన ఏ సినిమానైనా మంచి ఫలితం రాబట్టేలా మద్దతు నిలవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపైన ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నాని ఒంటరిగా చేసి.. పరువుపోయిందని అనేక కంటే మనమే తీసుకున్నామని సిగ్గుపడాలని కొందరు అంటున్నారు. బాలీవుడ్ లో పోయింది నాని పరువు కాదని టాలీవుడ్ పరువని మరికొందరు అంటున్నారు. మరి.. నాని దసరా విషయంలో జరిగిన ఈ పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.