నందమూరి తారకరత్న చిన్న ఏజ్ లోనే చనిపోయాడు. లైఫ్ లో ఏ చిన్న కాంట్రవర్సీ లేకుండానే తుదిశ్వాస విడిచారు. దీంతో తారకరత్న గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన లైఫ్ ని గుర్తుచేసుకుంటున్నారు.
నందమూరి తారకరత్న అందరివాడు! నార్మల్ గా ఓ వ్యక్తిని ప్రేమించే వాళ్లు ఉంటే.. పడనివాళ్లు కూడా కచ్చితంగా ఉంటారు. మీరు ఏ వ్యక్తిని తీసుకున్నాసరే దాదాపు ప్రతి ఒక్కరిలో ప్లస్సులు, మైనస్ లు ఉండటం కామన్. కానీ తారకరత్న విషయంలో ఇది జరగలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాదయాత్ర సందర్భంగా తారకరత్న కుప్పకూలిపోయినప్పుడు గానీ, ఆస్పత్రికి తరలించినప్పుడు గానీ చాలామంది సహాయం చేశారు. ఆయన తిరిగి రావాలని గట్టిగా కోరుకున్నారు. కానీ వాళ్ల దీవెనలు ఫలించలేదు. శివరాత్రి రోజే తారకరత్న శివైక్యం అయిపోయారు. అయితే తారకరత్న గురించి ఎవరేమనుకున్నా సరే ఆయన బతికినన్ని రోజులు అజాతశత్రువుగానే ఉంటూ వచ్చాడు.
తారకరత్న విషయానికొస్తే.. నందమూరి కుటుంబంలో పుట్టాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సక్సెస్ కాలేకపోయాడు గానీ నటుడిగా మాత్రం మెప్పించాడు. తన మూవీ కెరీర్ వల్ల ఇబ్బంది పడినప్పటికీ ఏం బాధపడలేదు. చాలామంది హీరోలు, చేయడానికే ఆలోచించే విలన్ రోల్ ని అది కూడా అప్పట్లోనే ‘అమరావతి’ మూవీలో చేశాడు. ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఆడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ కూడా చేస్తూ వచ్చాడు. అనుకున్నంతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు కానీ ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కర్ని కూడా పల్లెత్తు మాట అనలేదు. ఒక్కరితోనూ మాటపడలేదు. అందుకే తారకరత్న యువర్ రియల్లీ గ్రేట్!
తారకరత్న చనిపోయాడనే విషయం తెలిసి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాధపడ్డారు. తమకు తెలిసిన ‘ఒకటే నెంబరు కుర్రాడు’ ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ కు భౌతికకాయాన్ని తీసుకొచ్చి సందర్శనార్థం ఉంచితే.. పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు చాలామంది వచ్చారు. నివాళి అర్పించారు. తారకరత్నతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నందమూరి ఫ్యామిలీపై రాజకీయంగా విమర్శలు చేసేవాళ్లు కూడా మిగతావాళ్లని ఏమైనా అనేవారు ఏమోగానీ తారకరత్న గురించి మాత్రం కామెంట్ చేసేవారు కాదు. ఇది చాలు.. తారకరత్న లైఫ్ ఎంత స్పెషలో చెప్పడానికి.
తారకరత్న భార్య పిల్లల గురించే మాట్లాడుకుంటే.. ఫ్రెండ్స్ ద్వారా అలేఖ్యారెడ్డి అనే అమ్మాయి పరిచయమైంది. తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గానూ పనిచేసింది. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటాం అంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అలేఖ్య అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడమే దీనికి కారణం! అయినా సరే వెనక్కి తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో అలేఖ్యని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇరు కుటుంబసభ్యులు వీళ్లని అర్థం చేసుకున్నారు. అలా పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. దాంతో హ్యాపీ ఎండింగ్ అందుకున్నారు. లైఫ్ లో ఇలా ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండానే జీవిస్తూ వచ్చారు. మరి ఇలా మంచిగా ఉన్నాడని విధికి కన్నుకుట్టిందో ఏమో.. తారకరత్నని తీసుకెళ్లిపోయింది. నందమూరి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు.. తారకరత్న లాంటి ఓ మంచి మనిషిని దూరం చేసింది. దీంతో అతడికి గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్లు.. ఒక్క శత్రువు లేకుండా ఎలా బతికావయ్యా? నీకు నిజంగా హేట్సాఫ్ అని నివాళి అర్పిస్తున్నారు.