Nandamuri Taraka Ratna: ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండి తెర ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నట వారసులుగా వారి కుమారులు హరికృష్ణ, బాలక్రిష్ణలతో పాటు కొంతమంది మనవళ్లు కూడా సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నందమూరి తారకరత్న ఒకరు. మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా 2002లో తన కెరీర్‌ను ప్రారంభించిన తారకరత్న ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. ప్రతీ సినిమాలో నటన పరంగా మెప్పించిన ఆయన.. కమర్శియల్ సక్సెస్ అందుకోవటంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు.
కానీ, ఆయన విలన్‌గా నటించిన ‘అమరావతి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో తారకరత్న నటకు గానూ నంది అవార్డు సొంతం అయింది. అయితే, గత కొంతకాలంగా తారకరత్న సినిమా విషయంలో కాస్త స్లో అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తారకరత్న ‘9 అవర్స్’ అనే ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గురువారం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా తారకరత్న సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ను వెనక్కు నెట్టేయటానికే ఇండస్ట్రీలోకి వచ్చారా?…ఆఫ్ స్క్రీన్‌లో ఎన్టీఆర్‌తో రిలేషన్ ఎలా ఉండేది?.. అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తారకరత్న మాట్లాడుతూ.. ‘‘ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ 2000-2001 మధ్య సినిమాల్లోకి వచ్చారు. దాని తర్వాత నేను వచ్చాను. తమ్ముడు అప్పటికే ఆది లాంటి పెద్ద హిట్లు ఇచ్చేశారు. అలాంటి టైంలో నేను రావటంతో.. తారకరత్నను ఎన్టీఆర్‌కు పోటీగా దింపారనుకున్నారు. నేను ఈరోజు కూడా ఎన్టీఆర్‌కు కాంపిటీషన్ కాదు. ఆయన వేరే లెవెల్‌లో ఉన్నారు. మంచి నటుడు. ఏది ఏమైనప్పటికి మేము నందమూరి ఫ్యామిలీ. ఈ రోజు మా ఇంటి పేరు నిలబడ్డానికి జూ. ఎన్టీఆర్, ఆయన నటన కూడా ఓ కారణం.
తమ్ముడిగా ఆయన ఎదగటం నాకు సంతోషంగా ఉంది. నేను సినిమాల్లోకి రావాలనుకుని వచ్చాను. అది నా కల. చిన్నప్పటినుంచి మా మధ్య మంచి బంధం ఉంది. మా మధ్య సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి బంధం ఉంది. మేము ఎప్పుడు కలిసినా కూడా చాలా సంతోషంగా గడుపుతాం. ఎన్టీఆర్ బార్న్ ఆర్టిస్ట్.. ఆ టాలెంట్ అయనలో ఉంది. మన ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు’’ అని అన్నారు. మరి, జూ.ఎన్టీఆర్‌కు తాను కాంపిటీషన్ కాదన్న తారకరత్న మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.