నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ఫాంటసీ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించిన బింబిసార.. థియేటర్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా.. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు.
ఇక రిలీజ్ రోజు నుండే బింబిసార సినిమాను ప్రేక్షకులు, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీలు, స్టార్ హీరోలు సైతం అభినందించారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ.. బింబిసార సినిమాను కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ఠలతో కలిసి థియేటర్లో చూశారు. అలాగే సినిమా చూశాక బింబిసార చిత్రంపై, చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.
సినిమా మొదలు నుండి చివరివరకు ఎక్కడా తగ్గకుండా చూపించారని దర్శకుడి ప్రతిభను మెచ్చుకున్నారు బాలయ్య. మొదటిసారి రాజు పాత్రను పోషించిన అబ్బాయి కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడని అభినందించారు. ఇకపై కూడా ఇలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. ఇక ఇదివరకే బింబిసార సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూసి తన రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య రివ్యూతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ‘అఖండ’ మూవీతో బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం తన 107వ సినిమా చేస్తున్నాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక ఆ తర్వాత తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు బాలయ్య. ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. మరి బింబిసార మూవీ పట్ల బాలయ్య ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Babai- Abbai 🤩🕺#NBK #KalyanRam pic.twitter.com/L5XJSjod3e
— Fukkard (@Fukkard) August 13, 2022