ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వారు ఇప్పుడు బుల్లితెరపై తమ సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, యన్టీఆర్, నాని, రాణా వీరి బాటలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో తో అదరగొడుతున్నాడు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ వన్ పూర్తయ్యింది. త్వరలో ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2 కోసం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బుల్లితెరపై వస్తున్న టాక్ షో కి కూడా ఈ రేంజ్ లో ప్రజెంట్ చేస్తారా అన్నంత గొప్పగా ఉంది. నిధి వేటలో చేసే సాహసాలు హాలీవుడ్ రేంజ్ లో కట్ చేశారు. పాన్ ఇండియా లెవెల్లో ట్రైలర్ కట్ చేశారు. మొత్తానికి ఆహాలో టెలికాస్ట్ కాబోతున్న : ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2 ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
గత కొన్ని రోజులుగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న’అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. సరికొత్త గెటప్, పవర్ ఫుల్ డైలాగ్స్, స్టైలిష్ లుక్ అదిరిపోయే యాక్షన్ తో బాలకృష్ణ ట్రైలర్ లో దుమ్మురేపాడు. ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఈ తరహా చిత్రాల్లో బాలకృష్ణ నటిస్తే రికార్డుల మోత మోగడం ఖాయం అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. గత సీజన్ కంటే ఈసారి సరికొత్త హంగులతో రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్ అంటూ కత్తి తిప్పుతూ బాలయ్య చేసే విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రశ్నల్లో మరింతగా ఫైర్.. ఆటలో ఇంకాస్త డేర్.. సరదాగా ఉండే సెటైర్లు.. ఈసారి మరింత రంజుగా.. దెబ్బకు థింక్ మారిపోవాలా అంటూ కత్తిపట్టుకొని చెబుతున్న డైలాగ్స్ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. ఒక దశలో ఓటీటీ హిస్టరీలో హెచ్డీఆర్లో రిలీజ్ అయిన ప్రొమో ఈ రేంజ్ లో రావడం ఇదే మొదటి సారి.. హలీవుడ్ స్థాయికి తగ్గట్టు ఉందని అంటున్నారు అభిమానులు. బాలకృష్ణను ఈ రేంజ్ లో చూడటం నందమూరి ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబై పోతున్నారు. జాంబీ రెడ్డి, కల్కి లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ట్రైలర్ డైరెక్ట్ చేశారు. మొత్తానికి నందమూరి బాలకృష్ణను ఈ స్థాయిలో చూపించి ఫ్యాన్స్ ఖుషీ చేశారు డైరెక్టర్.
ఈసారి ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2 కి వచ్చే అతిధుల్లో పొలిటికల్ లీడర్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మొదటి గెస్ట్ గా చంద్రబాబు నాయుడు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ లు కూడా రాబోతున్నట్లు తెగు ప్రచారం జరుగుతుంది. ఈ శుక్రవారం అక్టోబర్ 14 నుంచి ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ట్రైలర్ లో బాలయ్యను ఈ రేంజ్ లో చూడగలమా అన్నట్లుగా చూపించారు.