Balakrishna: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణకు కరోనా సోకింది. తాజాగా, కరోనా పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో బాలక్రిష్ణ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు. గత రెండు రోజులనుంచి తనను కలుస్తున్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, బాలక్రిష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇక, నందమూరి నట సింహం బాలక్రిష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి ఓటీటీ టాక్ షో ‘‘ అన్‌స్టాపబుల్’ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో మొదటి సీజన్‌ను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది.
నిజానికి ఇంతక ముందెన్నడూ చూడని బాలక్రిష్ణను ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో ప్రేక్షకులు తెరపై చూశారు. ఆయన తన దైన స్టైల్లో ఆ షోను సూపర్ హిట్ చేశారు. అటు వచ్చిన గెస్ట్‌లను ఇటు ప్రేక్షకులను అందర్నీ తృప్తి పరిచారు. సింగిల్ హ్యాండ్‌తో సీజన్ 1ను విజయ తీరాలకు తీసుకెళ్లారు. ఇక, అతి త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి సీజన్‌ను మించి సీజన్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 2 నెవర్‌బిఫోర్ కాంబినేషన్‌లతో సాగనున్నట్లు సమాచారం. రానున్న సీజన్‌లో ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది స్టార్ హీరోల పేర్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది.
Breaking : #Balakrishna tested positive for #COVID19#NBK pic.twitter.com/VdsMowyACy
— Cine Chit Chat (@CineChitChat) June 24, 2022