నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే ఫ్యాన్స్ కాస్త భయపడతారు. ఆయన్ని కలవాలన్నా, కలిసి ఫొటో దిగాలన్నా సరే కొడతారమోనని సందేహాపడతారు. ఒకవేళ కొట్టినా సరే బాలయ్య తనని కొట్టార్రా అని ఆనందపడేవాళ్లు కూడా ఉన్నారు. దీని గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్.. తన అభిప్రాయం చెప్పారు. కానీ బాలయ్య అసలు కొట్టడం వెనక రీజన్ ఏంటనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా. ఓసారి దీని గురించే టాపిక్ వచ్చినప్పుడు బాలయ్య.. తనతో ఈ విషయం గురించి మాట్లాడారని సాయిమాధవ్ అన్నారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్న ‘వీరసింహారెడ్డి’కి డైలాగ్స్ రాసింది ఆయనే. ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. తాజాగా జరిగిన వాటి ద్వారానే బాలయ్య, తన ఫ్యాన్స్ ని కొట్టడం వెనకున్న రీజన్ ని బయటపెట్టారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్యకు ఇండస్ట్రీలో ఏ హీరో లేని స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన కోపాన్ని, ప్రేమని తట్టుకోవడం కాస్త కష్టమే! ఎందుకంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్.. ఏదైనా సరే ఆయన రూట్ సెపరేట్. బాలయ్యని బయటనుంచి చూస్తే కోపం ఎక్కువున్నా వ్యక్తిలా కనిపిస్తుంటారు. ఆయన్ని దగ్గర నుంచి చూస్తేనే అసలు విషయం ఐడియా వస్తుంది. బాలయ్య వ్యక్తిత్వం గురించి పలువురు సెలబ్రిటీలు.. పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇక హీరోగా చేస్తూనే ఎమ్మెల్యేగానూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అయితే జనాల్లోకి వెళ్లినప్పుడు అభిమానంతో దగ్గరకు వచ్చే ఫ్యాన్స్ పై అప్పుడప్పుడు బాలయ్య చేయి చేసుకుంటారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే బాలయ్య తన రూట్ అస్సలు మార్చుకోరు. ఇక దీని గురించి తనతో ఓసారి మాట్లాడారని రైటర్ సాయిమాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు.
‘హీరోలందరూ బౌన్సర్లను ఎందుకు పెట్టుకుంటున్నారు? ఫ్యాన్స్ ని నెట్టేందుకు కొట్టేందుకే కదా. నిన్నగాక మొన్నొచ్చిన చిన్న హీరోలు కూడా నలుగురు ఐదుగురు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. అంటే నా ఫ్యాన్స్ ని కొట్టేందుకు డబ్బులిచ్చి బౌన్సర్లని పెట్టుకోవాలా? నేను ఆ పనిచేయను. ఫ్యాన్స్ నాకు ఫ్యామిలీతో సమానం. అలాంటి వారిని కొట్టేందుకు వాడెవడు? కోపమొస్తే ఓ దెబ్బ వేస్తాను. వాళ్లకు కోపమొస్తే నా మీదకు వస్తారు.. అంతే తప్ప మధ్య బౌన్సర్లు ఎవరు? నేనేంటో నా ఫ్యాన్స్ కు తెలుసు. వాళ్లెంటో నాకు తెలుసు. నేనిది అని చెప్పాలా ఏంటి. ఇది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు’ అని బాలయ్య తనతో చెప్పినట్లు సాయిమాధవ్ బుర్రా రివీల్ చేశారు. దీన్ని చూసిన ఫ్యాన్స్.. మా బాలయ్య బాబు బంగారం అని ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. మరి బాలయ్య ఫ్యాన్స్ ని కొట్టడం, దానికి సమర్ధన మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
That’s Nandamuri Balakrishna for u❤️#VeeraSimhaReddy #NBK pic.twitter.com/cjgSEmybHt
— Balayya Trends (@NBKTrends) December 29, 2022