గత కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్స్ ధరలపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ- ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్, తర్వాత ఇద్దరూ కలిసి వివాదం చర్చించారు. తాజాగా ఈ టికెట్స్ ధరల వివాదంపై నంటసింహం నందమూరి బాలకృష్ణ స్పందించారు.
సోమవారం హైదరాబాద్ లో ‘అఖండ’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఆ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “అన్ సీజన్ లో అఖండ చిత్రాన్ని విడుదలైనా అఖండ విజయాన్ని సొంత చేసుకుంది. ఈ చిత్రం.. పాన్ వర్డల్ చిత్రంగా నిలిచిందని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. పాకిస్తాన్ లోనూ అఖండ చిత్రం చెలరేగుతోందని.. అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయి’ అని బాలయ్య వ్యాఖ్యనించారు.
మీడియా అడిగిన పలు ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానమిచ్చారు. ఈ సందర్భంలో ఏపీలోని సినిమా రేట్ల అంశంపై ప్రశ్నించగా.. ఈ వివాదంపై సినీ పరిశ్రమ కలసికట్టుగా ఉండాలని, టికెట్ ధరలపై చిత్రపరిశ్రమ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. ఏపీలో నెలకొన్న టికెట్ రేట్ల వివాదంపై చిత్రపరిశ్రమ నుంచి సరైన రిప్రజేంటేషన్ లేకపోవడమా? అని మీడియా అడిగిన మరో ప్రశ్నకు.. ఏపీలో వినిపించుకునే నాథుడు ఎక్కడని బాలకృష్ణ ప్రశ్నించారు. ఏపీలో సినిమా టికెట్స్ ధరల వివాదంపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.