బాలకృష్ణ ఎవరికీ భయపడరు. ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఇచ్చి పడేస్తారు. అయితే తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా హీరోలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అభిమానించే అభిమానులు ఉంటారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ప్రతీ రాజకీయ పార్టీలోనూ అభిమానించే అభిమానులు ఉంటారు. వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా బాలకృష్ణ అభిమాని అన్న సంగతి తెలిసిందే. అలాంటి బాలకృష్ణ అభిమాని అయిన వైసీపీ కార్యకర్తను ఆ పార్టీ ఎమ్మెల్యే వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాట పెట్టినందుకు సదరు కార్యకర్తను ఎమ్మెల్యే వేధించారన్న ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. తన అభిమానిని ఎమ్మెల్యే వేధించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ స్పందించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 3 రోజుల క్రితం జరిగిన ఘటనపై స్పందించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిలానే ఉండాలి అంటూ హితవు పలికారు. నీచానికి దిగజారద్దు అంటూ హెచ్చరించారు. మూడు రోజుల క్రితం ప్రభ ఊరేగింపు సందర్భంగా వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాట పెట్టారు. అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాలకృష్ణ పాట పెట్టిన కారణంగా భాస్కర్ రెడ్డిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేధించినట్లు ప్రచారం జరిగింది. దీంతో భాస్కర్ రెడ్డి.. ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. అది బాలకృష్ణ దృష్టికి వెళ్లడంతో తాజాగా ఈ ఘటనపై ఆయన స్పందించారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బాలకృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్లు, పొలిటీషియన్లలా ఉండాలని సూచించారు. నరసారావుపేటలో ఓ కార్యక్రమంలో తన పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని, రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దని హెచ్చరించారు. సినిమాని సినిమాలా చూడాలని అన్నారు. సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారని, తనను అభిమానించేవారు అన్ని పార్టీల్లో ఉంటారని అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని బాలకృష్ణ అన్నారు. అన్ని పార్టీల వాళ్ళు తన సినిమాలు చూస్తారని అన్నారు. తాను మూడవ కన్ను తెరిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు. తన సినిమా పాట పెడితే తప్పేంటి అని, పాట పెట్టినందుకు ఇంత నీచానికి దిగజారడం ఏంటని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యేకి సూచించారు. ఎమ్మెల్యేకు బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.