ఈ శుక్రవారం నందమూరి నటసింహ బాలకృష్ట పుట్టిన రోజు. నందమూరి నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్క్ చూపిస్తున్నారు బాలయ్య. యంగ్ హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు . ఇటీవల ‘అఖండ’ సినిమాతో బాలయ్య మరోసారి తన నట విశ్వ రూపం చూపించారు. ఈ సినిమా సాధించిన అఖండ విజయమే అందుకు నిదర్శనం. ఇలా టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయాలు అందుకున్న బాలయ్యకి ఓ కొరిక మాత్రం మిగిలే ఉందంట. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన బాలయ్యకు ఆ ఒక్క కోరిక మాత్రం ఇంక తీరలేదట. మరి.. ఆకోరిక ఏమిటో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
నందమూరి బాలకృష్ణ వరుస విజయాలు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి విజయాలు ఖాతాలో వేసుకున్నారు. గతేడాది ‘అఖండ’ చిత్రంతో బాలయ్య భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇదే జోరును నందమూరి నటసింహం తన తదుపరి సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇలా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసు దొచుకున్న బాలయ్యకు ఓ కోరిక మాత్రం మిగిలే ఉందంట. ఎప్పటి నుంచో విలన్ పాత్రలో నటించాలని బాలయ్య అనుకున్నారంటా. అయితే ఇప్పటికి ఆ కోరిక మాత్రం అలానే మిగిలి పోయింది. గతంలో సుల్తాన్ తో పాటు మరికొన్ని సినిమాలల్లో నెగిటివ్ పాత్రలు బాలకృష్ణ నటించారు. అయితే పూర్తి స్థాయిలో భారీ సినిమాలో విలన్ గా నటించాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయిందట. విలనిజంతో ప్రేక్షకులను అలరించాలనే కోరిక బాలయ్యకు ఎప్పటి నుంచో ఉందట.
ఇది చదవండి: కోట్లు సంపాదించిన నయనతార.. ఆస్తుల విలువ తెలిస్తే!
కానీ ఆ కోరిక ఇప్పటివరకు నెరవేరకపోవడం గమనార్హం. ఎంతోమంది దర్శకులను సంప్రదించి తనకోసం ఒక ప్రత్యేకమైన విలన్ పాత్రను తయారు చేయమని చెప్పారంట. ఈ క్రమంలో ఒక వేళ కథ నచ్చితే మల్టీ స్టారర్ మూవీ చేయడానికి కూడా బాలకృష్ట సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అవకాశం వస్తే.. ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తారంట. మరి.. బాలయ్య కోరిక తీర్చే దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ హంట్ టీజర్ పేరిట తాజాగా ఒక ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది.
ఇదీ చదవండి: స్టేజీ మీద సారీ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒక్కసారిగా ఏడ్చేసిన హీరోయిన్!
ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. అయితే బాలకృష్ణకు ఇప్పటికీ నేరవేరని ఈ విలన్ పాత్రలో నటించాలనే కోరిక పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.