టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ‘ చిత్రం విజయపరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఆ సినిమా.. గతేడాది డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో మూడో చిత్రంగా రూపొందిన అఖండ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని దేశవ్యాప్తంగా అటెన్షన్ సంపాదించుకుంది.
అదేవిధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఆ తర్వాత ఓటిటిలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. చాలాకాలం తర్వాత బాలయ్యకు అఖండ చిత్రం మాసివ్ సక్సెస్ అందించింది. అటు బోయపాటికి ఇటు బాలయ్యకు అఖండ ఇచ్చిన కిక్కు ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది. అయితే.. తాజాగా అఖండ చిత్రానికి బుల్లితెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఇక ఇటీవల అఖండ చిత్రం ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రీమియర్ గా టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో టెలివిజన్ ప్రీమియర్ గా అఖండ 13.3 టిఆర్పీ(TRP) రేటింగ్ నమోదు చేసినట్లు సమాచారం. అటు థియేట్రికల్ గా, ఓటిటి పరంగా అద్భుతాలు సృష్టించిన అఖండ మాస్ జాతరకి టీవీలో డీసెంట్ టిఆర్పీ రావడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.