సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా మేనియా కొనసాగుతోంది. రెండ్రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఈ సినిమాలో మహేశ్ కామెడీ టైమింగ్, లుక్స్, స్వాగ్ అన్నీ పోకిరి సినిమాని గుర్తుచేశాయంటూ ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు. కీర్తీ సురేశ్ ని కూడా డైరెక్టర్ పరశురామ్ ఎంతో కొత్తగా చూపించాడు. బ్యాంకుల చుట్టూ తిరిగే ఈ కథ ఎమోషన్స్ పరంగానూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో నమ్రత ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట కలెక్షన్ల జోరు.. రెండో రోజు మాస్ కలెక్షన్స్!
విషయం ఏంటంటే.. నమ్రత సర్కారు వారి పాట సినిమా రిలీజ్ రోజు ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు. ఆ షోకి డైరెక్టర్లు హరీశ్ శంకర్, అనీల్ రావిపూడి కూడా హాజరయ్యారు. అయితే నమ్రత ఇలా ఫ్యాన్స్ తో కలిసి ఓ మాస్ థియేటర్లో మహేశ్ బాబు సినిమా రిలీజ్ రోజు చూడటం ఇదే మొదటిసారి. అందుకే ఆరోజు నమ్రత ఫొటోలు, వీడియోల బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆమె పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా కెమెరాల్లో ఎక్కువగా హైలెట్ అయ్యారు. అనీల్ రావిపూడి కూడా ప్రత్యేకంగా పలకరించడం చూసి ఎవరు ఆవిడ అంటూ వెతుకులాట ప్రారంభించారు. ఆవిడ మరెవరో కాదు.. నమ్రత సోదరి శిల్పా అనమాట. చాలా రోజుల తర్వాత ఆవిడను చూడటం వల్ల చాలా మంది గుర్తు పట్టలేదు. శిల్పా కూడా ఒక నటి, ఒకప్పటి ఫొటో మోడల్ కూడా. ప్రస్తుతం వారి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.