ఎవరైనా ఏజ్ పెరిగేకొద్ది అందం కోల్పోతారు. కానీ మహేష్ బాబు మాత్రం తన అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మగాళ్ళకే అసూయ కలిగేలా అందాన్ని మెయిన్‌టెయిన్ చేయడం ఏదైతే ఉందో అది ‘టేక్ ఏ బౌ’ అన్న మాట. తాజాగా మహి లుక్‌కి సంబంధించిన ఫోటోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో మహి.. క్లాస్ లుక్‌లో నిలబడి.. ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు ఫోజిచ్చారు. ఇందులో చెప్పుకోవడానికి ఏముంది అని అనుకోకండి. ఈ ఫోటోలో మహి జుట్టు పెంచి, కాస్త గడ్డం పెంచారు. అభిమానులు ఈ ఫోటోలో మహిని చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
బియర్డ్ లుక్, లాంగ్ హెయిర్‌తో అన్నయ్య లుక్ అదుర్స్, SSMB28 మూవీ కోసం ఇక ఆగలేము అంటూ ఒకరు కామెంట్ చేయగా.. రాబోయే మూవీలో ఈ లుక్‌ని కోరుకుంటున్నామని మరో అభిమాని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే ఫోటోలో బ్యాగ్ తగిలించుకుని మహేష్ కూతురు సితార లాంగ్ హెయిర్‌తో నిలబడి నాన్న వైపు చూస్తూ ఉంది. మహేష్ మాత్రం ఫోన్‌లో ఏదో ముఖ్యమైన విషయం గురించే మాట్లాడుతున్నట్లు కనబడుతున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ ఒక మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కుటుంబంతో స్విట్జర్లాండ్ టూర్‌ని ఎంజాయ్ చేస్తున్న మహికి, త్రివిక్రమ్ కాల్ చేసినట్టు.. మహి త్రివిక్రమ్‌తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఫోటో చూస్తుంటే. “ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు ఇండియా రావడానికి” అని త్రివిక్రమ్ అడగగా.. “ఈ గడ్డం ఇంకా పెరగాలి కదా.. పెరిగాక వస్తా” అని మహేష్ సమాధానం చెప్పినట్టు ఉంది ఈ పిక్ చూస్తుంటే. (జస్ట్ ఫర్ ఫన్)
మహేష్ సినిమాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమా షూటింగ్ అయిపోయాక, లగేజ్ ప్యాక్ చేసుకుని ఫేవరెట్ ప్లేసులు చుట్టేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం స్విట్జర్లాండ్ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మే నెల నుండి టూర్ మొదలుపెట్టిన మహి ఫ్యామిలీ.. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ అంటూ దేశాలు చుట్టేస్తూ వచ్చారు. ఫ్యామిలీ మొత్తం వరల్డ్ టూర్ ప్లాన్ చేసినట్టున్నారు. కానియ్యండి. ఇండియా వచ్చేటప్పటికి అన్నయ్య గుబురు గడ్డం, పెద్ద మీసంతో ఉండాలి. ఆ బాధ్యత నీదే వదినమ్మ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ ఇండియా వచ్చేటప్పటికి గుబురు గడ్డం, మీసం పెంచుకుని రఫ్ లుక్‌లో దర్శనమిస్తారో? లేక ట్రిమ్ చేసుకుని సాఫ్ట్ బాయ్‌లా వస్తారో? దీనిపై గెస్ ఏంటో కామెంట్ చేయండి.