నమ్రతా శిరోద్కర్.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.. మోడల్‌గా రాణించింది.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ చిత్రంలో.. మహేష్ బాబుకు జోడిగా నటించింది నమ్రతా. ఆ తర్వాత రీల్ కపుల్ కాస్త.. ప్రేమలో పడి.. రియల్ కపుల్‌గా మారారు. వీరి వివాహం జరిగి ఇప్పటికి 15 ఏళ్ల అవుతుంది. వీరికి ఇద్దరు సంతానం గౌతమ్, సితార ఉన్నారు. ఒకప్పుడు అందాల కిరీటం గెలుచుకుని.. హీరోయిన్‌గా రాణించిన నమ్రత.. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇల్లు, భర్త, పిల్లలు వారే లోకంగా బతుకుతుంది. ఇక మహేష్, పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. యాక్టీవ్‌గా ఉంటారు నమ్రతా.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నప్పటికి.. మీడియాకు చాలా దూరంగా ఉంటారు నమ్రత. ఈ క్రమంలో తాజాగా ఆమె సీనిరయర్ జర్నలిస్ట్.. ప్రేమ యూట్యూబ్ చానెల్‌కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నమ్రత.. తన కుటుంబం, కెరీర్, మోడలింగ్, సినిమాలు, మహేష్‌తో పరిచయం, పెళ్లి.. జీఎంబీ ప్రొడక్షన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రేమ.. నమ్రతాను ఉద్దేశించి.. మీకు, మహేష్ బాబకు ఏ విషయంలో గొడవలు జరుగుతాయి అని ప్రశ్నించారు. అందుకు ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుత నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రేమ అడిగిన ప్రశ్నకు.. నమ్రత సమాధానం ఇస్తూ.. ‘‘పిల్లల విషయంలో మా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఎందుకంటే నేను కాస్త స్ట్రిక్ట్‌గా ఉంటాను. కానీ మహేష్ అలా కాదు. వాళ్లతో జాలీగా ఉంటాడు. దాంతో పిల్లలు నేను ఏ విషయంలో అయినా నో చెప్తే.. వెంటనే మహేష్ దగ్గరకు వెళ్లి.. తనని అడిగి ఎస్ చెప్పించుకుంటారు. దాంతో నాకు కోపం వచ్చి తన మీద అరుస్తాను. పిల్లల విషయంలోనే మేం ఎక్కువగా గొడవపడుతుంటాం’’ అని చెప్పుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.