నమ్రత.. హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టమనేని కోడలుగా మరింత మంది అభిమానాన్ని పొందారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైనా కూడా.. సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటూ ఉంటారు. వారి డైలీ యాక్టివిటీస్, వెకేషన్స్ కు సంబంధించిన పిక్స్, వీడియోలు షేర్ చేస్తుంటారు. మహేశ్, గౌతమ్, సితారల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. తాచాగా నమ్రత చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. గౌతమ్ విషయంలో భావోద్వేగానికి లోనయ్యారు.
గౌతమ్ చదువుతో పాటు కల్చరల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నాడు. తాజాగా వారి స్కూల్ లో తన తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కల్చరల్ ఈవెంట్ కోసం గౌతమ్ విదేశాలకు వెళ్తున్నాడు. గౌతమ్ తన చిన్నప్పటి నుంచి చాలాసార్లు చాలా దేశాలకు వెకేషన్ కు వెళ్లాడు. అయితే అప్పుడు కుటుంబంతో వెళ్లాడు. కానీ, ఇప్పుడు ఒంటరిగా తన కల్చరల్ గ్రూప్ తో కలిసి విమానం ఎక్కేశాడు. ఆ విషయాన్ని తల్చుకుని నమ్రత ఎమోషనల్ అయ్యారు. మొదటిసారి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
“మొదటిసారి ఒక్కడే కల్చరల్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్తున్నాడు. తను వెళ్తుంటే నాలోని ఓ భాగం నా నుంచి విడిపోయిన భావన కలుగుతోంది. ఆ రోజంతా నాకు అలాగే ఉంది. ఇప్పుడిడ్డుపే నిదానంగా సాధారణ స్థితికి వస్తున్నాను. కానీ, అతను తిరిగి మా ఇంటికి, మా కళ్ల ముందుకు వచ్చే వరకు నాకు బాధగానే ఉంటుంది. గౌతమ్ పెద్దవాడు అయ్యాడు. గూటిని వదిలి ఒక్కడే ఎగిరిపోయాడు. నీకు ఈ ట్రిప్ ఆనందంగా, ఆహ్లాందగా సాగాలని కోరుకుంటున్నాను” అంటూ నమ్రత ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.