సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ దంపతుల గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నారి.. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులర్ అయింది. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సితార తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మహేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లోని ‘పెన్నీ’ సాంగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.ఘి
ఇది కూడా చదవండి: నీలా ఎవ్వరూ ఉండరు నాయనమ్మ.. సితార పోస్ట్ వైరల్!
ఈ క్రమంలో ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నమ్రత, సితార గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సితార విషయంలో తనకు మహేష్ కు ఎలాంటి భయాలు లేవని.. నమత్ర చెప్పారు. సితార ఇష్టపడే పనిలో ప్రోత్సహిస్తూ సంతోషపరుస్తున్నామని నమ్రత పేర్కొంది. ఇప్పుడు సితారకు కేవలం తొమ్మిదేళ్లే కాబట్టి.. ఈ వయస్సులో పిల్లలకు సరైన గైడైన్స్ అవసరమని భావిస్తున్నందున.. ఈ ఫ్రీడమ్ కొన్ని పరిమితులతో ఉంటుందని నమ్రత పేర్కొంది.
ఇది కూడా చదవండి: కుమార్తె డ్యాన్స్ చూసి మురిసిపోయిన మహేష్!‘‘సితారకి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల వయసు కనుక తనకు ఏది మంచి ఏది చెడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి నేను, మహేష్ తెలియజేస్తూ ఉంటామని’’ నమ్రత తెలిపారు. సితార ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో ఎంతో క్లారిటీగా ఉండడమే కాకుండా తన హద్దులలో తాను ఉంటుందని, ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయదని నమ్రత చెప్పుకొచ్చారు. నమ్రత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.