అలనాటి అందాల తార నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 90ల కాలంలో నగ్మా పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారన్నా అతిశయోక్తి కాదు.
అయితే ఆమె సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తల్లోనూ ఎక్కువుగా నిలిచేది. టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఇద్దరూ కలిసి తిరుపతి వెళ్లారని, రహస్యంగా పెళ్లి చేసుకున్నారని జాతీయ మీడియాలో సైతం వార్తలు ప్రచురించారు. వీరిద్దరి వ్యవహారం గంగూలీ భార్య డోనాకు తెలియడంతో దూరమయ్యారని టాక్. ఆ తరువాత కూడా నగ్మా.. శరత్ కుమార్, రవి కిషన్ తో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇలా నిత్యం ఎఫైర్ వార్తల్లో నిలిచిన నగ్మా చివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది. తాజాగా, నగ్మా.. తన చెల్లెలు, సినీ నటి జ్యోతిక, ఆమె భర్త సూర్యతో కలిసి ముంబైలోని ఓ హోటల్ లో కనిపించింది. వాస్తవానికి నగ్మా- జ్యోతిక అక్కాచెల్లెళ్లు. ఈ కారణంగానే వీరు కలిసి ఉండవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నగ్మా.. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్తుంటారు. తనకు పన్నెండేళ్ల వయసులో ఆమె శరీరంలోకి హార్మోన్స్ ఎక్కించడం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయట. వీటి మూలంగా ఆమె శరీరంలో మార్పులు చోటు చేసుకొని సినిమాలకు సరిపోయే విధంగా ఆమె తయారైందని అప్పట్లో మాట్లాడుకునేవారట. ఏదేమైనా ఆమె ఆనతీకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ సినీ ఇండస్ట్రీలలో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తరువాత ఆమె మెల్లగా తెరపై కనిపించడం కనుమరుగయ్యింది. అలా దూరమైన ఆమె ప్రస్తుతం రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటోంది.