The Ghost: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక, ఘోస్ట్ సినిమా యాక్షన్ ప్యాకెడ్‌గా ఉండనుంది. ఈ సినిమాలో 12 భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్లు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెలిపారు. యాక్షన్ బ్లాక్ పెడితే నాగార్జున చాలా ఫ్లెక్స్ బుల్ గా.. సూపర్ ఫాస్ట్ గా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
నాగార్జున ఈ సినిమాకోసం ఎంతో శ్రమకు ఓడ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నట్లు స్వయంగా నాగార్జునే చెప్పుకొచ్చారు. నాగార్జున తాజాగా, మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ ది ఘోస్ట్’లో యాక్షన్ పార్ట్ మేజర్ హైలెట్. ప్రవీణ్ సత్తార్ యాక్షన్‌ని అద్బుతంగా తీశారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు టెర్రిఫిక్‌గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ సీన్స్ చేశాను.
ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో అప్‌డేట్ తాజాగా, విడుదలైంది. కిల్లింగ్ మిషిన్ పేరుతో చిత్ర బృందం ఈ వీడియోను విడుదల చేసింది. నాగార్జున కత్తి ఫైట్‌కు సంబంధించిన ఆ వీడియోకు మంచి ఆధరణ లభించింది. మరి, ఘోస్ట్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan:4 నెలలపాటు దీక్షలో పవన్ కల్యాణ్.. ఎందుకంటే!