టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్.. ది ఘోస్ట్ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. రిలీజ్ దగ్గరపడటంతో కింగ్ నాగ్ తో పాటు చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అయితే.. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసిన ఘోస్ట్ మూవీపై నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్ లో కూడా సక్సెస్ మీట్ లో కలుద్దాం అని ముందే చెబుతుండటం గమనార్హం.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా మీడియా నుండి ఎదురైన ఓ చిలిపి ప్రశ్నకు నాగ్ ఇంటరెస్టింగ్ ఆన్సర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు. “మీకు స్క్రీన్ మీద అమ్మాయిలతో రొమాన్స్ ఇష్టమా? లేక గన్స్ తో ఫైరింగ్ ఇష్టమా ? అని అడిగిన ప్రశ్నకు నాగ్ నవ్వుతూ బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఒక చేతిలో గన్ను, మరో చేతిలో అమ్మాయి’ అని చెప్పి సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం నాగ్ మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఘోస్ట్ ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్ అని చెప్పిన నాగ్.. తమ సినిమాను విష్ చేసినందుకు చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు.