యువ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శ్రీ కార్తీక్ తెరకెక్కించాడు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ కు తల్లిగా అమల అక్కినేని నటించిగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 9 తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తమిళ్ లో ‘కణం’ అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘ఒకే ఒక జీవితం’ శర్వానంద్ కి 30వ మైలురాయి చిత్రం. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మంగళవారం స్పెషల్ సెలెబ్రిటీ ప్రీమియర్ షోని ప్రదర్శించారు. ఈషోకి చిత్ర బృందంతో పాటు కింగ్ నాగార్జున, అఖిల్ అతిథులుగా వచ్చారు.
మంగళవారం రాత్రి వేసిన ఈ స్పెషల్ షోకి శర్వానంద్ తల్లి, అమల అక్కినేని తల్లి కూడా హాజరయ్యారు. హను రాఘవపూడి, చందు మొండేటి, మల్లిడి వశిష్ట, మారుతి మరికొందరు దర్శకులు కూడా ఈ ప్రీమియర్ షో చూశారు. ‘ఒకే ఒక జీవితం’ సెలబ్రిటీ ప్రీమియర్ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన ప్రముఖులు..చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాను చూసి నాగార్జున ఫుల్ ఎమోషనల్ అయ్యారు. కొన్ని సన్నివేశాలకు తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూసిన అనంతరం శర్వానంద్, అమల లను నాగార్జున హగ్ చేసుకొని అభినందించారు. అమ్మపై ప్రేమ ఉన్నవారికి ఈ సినిమా చూస్తే కంట నీరు వస్తాయని నాగ్ తెలిపారు. ఈ సినిమాలోని కథ మరియు డైరెక్షన్ ను నాగ్ బాగా ఇష్టపడినట్లు తెలుస్తోంది.
ఒక మంచి ఫ్యామిలీ మూవీతో అమల మళ్లీ ఎంట్రీ ఇచ్చినందుకు నాగ్ సంతృప్తి చెందారు. సెన్సిటివ్ సబ్జెక్ట్ ని సమర్ధవంతంగా డీల్ చేసినందుకు దర్శకుడు శ్రీ కార్తీక్ ను కూడా ఆయన అభినందించారు. అక్కినేని నాగార్జునతో పాటు పలువురు సినీ దర్శకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.