‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. ఎన్నడు లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తమ మొదటి ఓటును వినియోగించుకున్న కళాకారులు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఓటింగ్ రాని వారు కూడా ఈసారి ఓటు వేసినట్లు చెప్తున్నారు. ఎమ్మెల్యో రోజా కూడా ఆవిడ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓట వేశాక మా ఎన్నికలకు సంబంధించి కీలకవ్యాఖ్యలు చేశారు.
‘ఓటు వేయడానికి రాగానే తిరిగిన కుటుంబాన్ని కలిసినట్లు అనిపించింది. మా మధ్యలో ఎలాంటి రాజకీయాలు ఉండవు. మేమంతా ఒక్కటే. ఈసారి మా ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపించాయి. మీమ్స్ కానివ్వండి, పోస్టులు కానివ్వండి.. నేను వాటిని ఖండిస్తున్నాను. అది వాళ్లకు కూడా తెలిసినట్లుంది. రెండు ప్యానళ్ల సభ్యులు కలిసికట్టుగా మీడియా ముందుకు రావడం జరిగింది. గెలిచినా.. ఓడినా ఉన్న 900 మంది కళాకారులే మాను ముందుకు నడిపించాలి. కరోనా కారణంగా ఎంతో మంది కళాకారులు నష్టపోయారు. తీవ్ర ఇంబ్బందులు పడ్డారు. వారిని ఆదుకోవాలి. గెలిచిన వారితో కలిసి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలిసి కావాల్సిన సహాయాన్ని పొందేందుకు నేను కూడా కలిసి పనిచేస్తా’ అని రోజా తెలిపారు.