సినీ తారలకు సంబంధించి ఏ చిన్న పుకారు బయటికి వచ్చినా.. అది తెల్లారేసరికి హాట్ టాపిక్ గా మారిపోతుందనే సంగతి తెలిసిందే. అక్కడ లేని విషయాన్నీ కూడా సృష్టించి వైరల్ చేసేవారు ఎంతోమంది ఉంటారు. మెగా డాటర్ నిహారిక విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మెగా డాటర్ నిహారిక వైవాహిక జీవితంపై, విడాకులు అంటూ వచ్చిన రూమర్స్ పై ఇండైరెక్ట్ గా స్పందించారు నాగబాబు.
ఓ నెటిజన్.. నిహారిక అక్క ఇన్స్‌స్టా అకౌంట్ డీ-యాక్టివేషన్ పై స్పందించమని నాగబాబుని కోరాడు. నెటిజన్ ప్రశ్నకు స్పందించిన నాగబాబు.. ‘నేనే కోడింగ్ నేర్చుకొని హాక్ చేసి నిహారిక ఇన్స్‌స్టా అకౌంట్ డిలీట్ చేశా. డీకోడింగ్ నేర్చుకోగానే రీ- యాక్టివేషన్ చేస్తాను’ ఫన్నీ రిప్లై ఇచ్చారు. మాములుగానే నిహారిక.. ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్. పైగా పెళ్లి తర్వాత కూడా రెగ్యులర్ గా పోస్టులు పెట్టింది. అలాంటిది ఒక్కసారిగా ఇన్ స్టా అకౌంట్ తొలగించేసరికి నెటిజన్స్ లో సందేహాలు రేకెత్తాయి. నిహారికకు తన భర్తతో మనస్పర్థలు వచ్చి ఉంటాయని, అందుకే ఇలా చేసిందంటూ పుకార్లు వైరల్ అయ్యాయి.అయితే.. తాజాగా ఈ పుకార్ల పై నాగబాబు ఇంత ఫన్నీగా రిప్లయ్ ఇవ్వడంతో నిహారిక – చైతన్య వైవాహిక బంధంలో ఎలాంటి సమస్యలు లేవని.. అర్ధం అయిపోయింది. మరి.. నిహారిక విషయంలో నాగబాబు రియాక్ట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.